చలికాలంలో ఎక్కువ ఆకలి ఎందుకు వేస్తుంది..?

వేసవికాలంలో కొద్దిగా నూనె ఎక్కువైనా, స్పైసీ ఫుడ్ తిన్నా మన ఆరోగ్యం పాడైపోతుంది. కానీ చలికాలంలో త్వరగా ఆహారం జీర్ణం అయిపోతుంది. ఏ రకం ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణం అయిపోతుంది. అజీర్తి సమస్యలు కూడా చలికాలంలో ఎక్కువగా కలగవు.

 

ఏం తిన్నా కూడా త్వరగా జీర్ణం అయి పోవడం పైగా చాలా రకాల ఆహార పదార్థాల మీద ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. మళ్లీ మళ్లీ ఆకలి కూడా వేస్తుంది. అయితే అసలు ఎందుకు ఆకలి చలికాలంలో పెరుగుతుంది అనేది మీకు తెలుసా..? మరి దాని కోసం ఇప్పుడు చూద్దాం.

చలికాలంలో టెంపరేచర్ బాగా తక్కువ ఉండడం వల్ల మన ఒళ్ళు వేడిగా మారడానికి ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. ఎనర్జీని సప్లై చేయడానికి మెటబాలిక్ రేటు పెరుగుతుంది. దీంతో ఆకలి బాగా పెరుగుతుంది. అందుకనే ఎక్కువ ఆహారం తీసుకుంటాము. దీంతో బరువు కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే బాగా బరువు పెరిగి పోతే మళ్ళీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి:

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా ఉంటుంది. పైగా ఫైబర్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. రాగి, ఓట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. అలానే క్యారెట్లు, కమలాలు, పాలకూర, మెంతులు, బీట్రూట్ వంటి వాటిని డైట్లో ఎక్కువగా తీసుకోండి. ఇవి అజీర్తి సమస్యలు రాకుండా చూసుకుంటాయి. ఇలా పాటిస్తే ఒబిసిటీ కూడా రాదు.

వేడి నీళ్ళు తాగండి:

వేడి నీళ్లు తాగడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. అలానే జలుబు, ఫ్లూ వంటివి ఉండవు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మీరు ఎక్కువ ఆకలి వేస్తుంది అనుకుంటే రైస్, రోటి వంటి వాటికి బదులుగా సూప్, జ్యూస్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. దీంతో బరువు కంట్రోల్లో ఉంటుంది.