30తర్వాత మహిళలు చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు..

-

వయసు పెరుగుతున్నప్పుడు శరీరం మారుతుంటుంది. ఒక్కో వయసులో శరీరం ఒక్కోలా ఉంటుంది. అందుకే శరీరంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా 30 దాటుతున్న మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొవాలి. ఎందుకంటే వయసు 30దాటుతున్నప్పుడు అనేక బాధ్యతలు, పని ఒత్తిళ్ళు మీద పడతాయి. ఇటు పని, అటు కుటుంబం రెండింటి మధ్య మానసికంగా నలిగిపోవాల్సి ఉంటుంది. అందువల్ల శరీరం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

women
women

ప్రస్తుతం 30దాటిన మహిళలు చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలేంటో ఇక్కడ చూద్దాం.

కంప్లీట్ బ్లడ్ కౌంట్

సీబీసీ.. ఈ పరీక్ష ద్వారా ఎర్ర రక్తకణాల సంఖ్య, తెల్ల రక్త కణాల సంఖ్య తెలుస్తుంది. దీనివల్ల రక్తహీనత ఇంకా రక్త క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్న విషయాలు అర్థం అవుతాయి. చాలామంది మహిళల్లో రక్తహీనత అనేది పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఈ టెస్టు తప్పనిసరిగా చేయించుకోవడం ఉత్తమం.

లిపిడ్ ప్రొఫైల్

కొవ్వు శాతం ఎలా ఉందనే సంగతి తెలుసుకోవడానికి పనిచేస్తుంది. హృదయ ఆరోగ్యం ఎలా ఉందన్న తదితర విషయాలు ఈ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. గుండె ఆరోగ్యం, హార్ట్ అటాక్ వంటి ఇబ్బందులను ముందే తెలుసుకునే అవకాసం ఉంది.

థైరాయిడ్

10మంది మహిళల్లో ఒక్కరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య చాలాకాలం వరకు బయటకు రాదు. నెలసరి సరిగ్గా లేకపోవడం, అమాంతం బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలిపోవడం, సంతాన సమస్యలు తలెత్తడం మొదలగునవి లక్షణాలుగా ఉంటాయి.

రక్తంలో చక్కెర

35-45ఏళ్ల మధ్యలో చక్కెర వ్యాధిన పడే మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా చాపకింద నీరులా పెరుగుతూ పెరుగ్తూ వచ్చే డయాబెటిక్ నుండి రక్షణ పొందడానికి రక్తంలో చక్కెర శాతం ఎలా ఉందనే తెస్టు నిర్వహించాలి.

Read more RELATED
Recommended to you

Latest news