యోగా మ్యాట్ కొంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్క్కరికీ ఫిట్ నెస్ మీద శ్రధ్ధ పెరిగింది. అందులో భాగంగా చాలామంది యోగాసనాలు వేస్తున్నారు. యోగా చేయడానికి యోగా మ్యాట్ ఖచ్చితంగా అవసరం. ఇంట్లో ఉపరితలం ఒకేలా ఉండదు కాబట్టి ఈ మ్యాట్ వాడాలి. ఐతే చాలామంది యోగా మ్యాట్ ని ఆన్ లైన్ లో కొనుక్కుంటున్నారు. అసలెలాంటి అవగాహన లేకుండా కేవలం యోగా మ్యాట్ అని సెర్చ్ చేసి కొనేస్తున్నారు. కానీ మీకిది తెలుసా? యోగా మ్యాట్ కొనడానికి కొన్ని లెక్కలున్నాయి.

మీ బరువు, మీరు వేసే యోగాసనాలను బట్టి ఎలాంటి మ్యాట్ కొనాలనేది నిర్ణయించుకోవాలి. ముందుగా,

మందం

యోగా మ్యాట్ కొంచెం మందంగా ఉంటేనే మంచిది. ఎక్కువ రోజులు మన్నిక ఉండడమే కాకుండా కొన్ని ఆసనాలకి సరిగ్గా ఉంటుంది. మీ మ్యాట్ సన్నగా ఉంటే ఆసనాలు వేసే సమయంలో మీ మోకాళ్ళపై బరువు ఎక్కువగా పడుతుంది. అందుకే మందం ఎక్కువగా ఉన్న యోగా మ్యాట్స్ మాత్రమే వాడాలి. ఈ మందం 8ఎమ్ఎమ్ నుండి 12ఎమ్ఎమ్ వరకు ఉండాలి. 10ఎమ్ఎమ్ కంటే ఎక్కువ మందంగా ఉన్న యోగా మ్యాట్స్ అన్ని యోగాసనాలని బాగా పనిచేస్తాయి.

సైజ్

మీ ఎత్తు, వెడల్పుని బట్టి యోగా మ్యాట్ ఎంచుకోవాలి. సాధారణంగా 6 X 2అడుగుల యోగా మ్యాట్స్ అందుబాటులో ఉంటాయి. కానీ మీ భుజాల వైశాల్యం ఎక్కువగా ఉంటే 7 X 2.5 అడుగుల యోగా మ్యాట్ తీసుకోవాలి.

గ్రిప్

మీరు కొత్తగా యోగా చేయడం మొదలెట్టినట్లయితే గ్రిప్ ఎక్కువగా ఉన్న మ్యాట్స్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆసనాలు చేసేటపుడు కిందపడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి నుండి కాపాడడానికి గ్రిప్స్ ఎక్కువగా ఉన్న మ్యాట్ వాడాలి.

మెటీరియల్

ఆ మ్యాట్ తయారు చేయడానికి వాడిన మెటీరియల్ కూడా మీ ప్రభావం చూపుతుంది. మంచి మ్యాట్లు తడిసినా కూడా యోగా చేయడానికి పనికి వస్తాయి. ముందుగా ఇవన్నీ ఆలోచించిన తర్వాతే యోగా మ్యాట్ తీసుకోండి.