నిమ్మరసం ( Lemon Water ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ తొక్క నుండి నిమ్మరసం వరకు ప్రతి ఒకటి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. యాంటిసెప్టిక్ గా కూడా నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంతో పాటు ఎన్నో రకాల ఔషధాల తయారీలో నిమ్మని ఉపయోగిస్తూ ఉంటారు.
రోజు వారి ఆహారంలో నిమ్మను తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే అజీర్తి, పైత్యం తగ్గిపోతాయి. అదే విధంగా లివర్ క్లీన్ అవుతుంది. నిమ్మరసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూసుకుంటుంది. జీర్ణ క్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు ఉండవు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నిమ్మతో ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు.
అలానే నిమ్మని ఉపయోగించడం వల్ల బరువు కూడా తగ్గచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణంగా నిమ్మరసం తీసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కనుక మీరు మీకు నచ్చిన కూరగాయలను అన్నిటినీ కట్ చేసుకొని దానిలో నిమ్మ రసం వేసుకుని కూడా తీసుకోవచ్చు.
లేదా నిమ్మ రసం లో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకు తీసుకోవచుచు. లేకపోతే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి మొదలైన సమస్యలు ఉండవు. ఇలా సులభంగా బరువు తగ్గొచ్చు.