ఈరోజు ఆ రాశి వారికి అనుకోని సమస్యలు..జాగ్రత్త..

-

జూన్ 24 శుక్రవారం రాశి ఫలాలు..ఏ రాశివారికి మంచి ఫలితాలు ఉన్నాయో చుద్దాము…

మేషం

మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో అర్దికపరమైన చర్చలు చేస్తారు.శివుడిని ఆరాధిస్తే మేలు కలుగుతుంది.

వృషభం

లాభాలు తక్కువ, శ్రమ అధికం. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. శ్రీహరిని పూజిస్తే సానుకూల ఫలితాలు కలుగుతాయి..

మిథునం

ఆటంకాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. చెడు బుద్ధి కలిగిన వారికి దూరంగా ఉండాలి. పరమేశ్వరుడిని దర్శించుకోవడం ఉత్తమం..ఉత్తర దిక్కు ప్రయాణాలు లాభం.

కర్కాటకం

ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు, విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. అభివృద్ధికి దోహదపడేలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు కలుగుతుంది.

సింహం

వీరికి మిశ్రమకాలం నడుస్తోంది. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనుల్లో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల శుభం చేకూరుతుంది.

కన్య

చేపట్టిన పనులు, కార్యక్రమాల్లో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ సమయస్ఫూర్తితో అధిగమిస్తారు.శుభవార్తలు వింటారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివుడిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.

తుల

పట్టుదలతో అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. నేడు ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.కీలక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది. మాటలు జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడిని ఆరాధించడం శుభప్రదం.

వృశ్చికం

వీరికి గ్రహబలం బాగుంది. ఆయా రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒక శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది.వ్యాపారం, ఉద్యొగాలలో శుభవార్తలు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం ఉత్తమం.

ధనస్సు

చేపట్టిన రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసం, మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవాలి. ఇష్టదైవారాధన వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.

మకరం

ఈ రాశివారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే సానుకూల ఫలితాలు పొందుతారు.ఈరోజు మంచి రోజు..

కుంభం

ఈ రాశివారికి మంచి కాలం నడుస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధనధాన్యవృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ చేయడం మంచిది.

మీనం

ఆయా రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. శ్రీనరసింహస్వామి ఆరాధిస్తే శుభప్రదం..దూర ప్రయాణాలు లాభం.

Read more RELATED
Recommended to you

Latest news