శనివారం మే 14 న రాశి ఫలాలు..

-

మేషం: సమాజంలో పలుకుబడి గతంలో కంటే ఎక్కువ  పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి.నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. భార్యతో సంతోషంగా ఉంటారు.

వృషభం: ఎప్పటి నుంచో అనుకున్న పనులు నేర వేరతాయి..ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి..ఈరోజు మంచి రోజు..

మిథునం: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయట పడతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన, కొత్త వాహనాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.ఇక ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు, దేవాలయాలను సందర్సిస్తారు.

కర్కాటకం: ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఇంట్లో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు..ఈరోజు అనుకున్న ఫలితాలు కలుగుతాయి.ఈరోజు ఈ రాశి వారికి శుభ ప్రదమైన రోజు.

సింహం: నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.ఇంట్లో కొత్త కార్యక్రమాలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కన్య: వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి..సమాజంలో మంచి పేరు ఉంటుంది.

తుల: దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి..విందు, వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం: ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు..కొత్త రుణాలు అందుతాయి.

ధనస్సు: ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు తొలగి పోతాయి.. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.. దైవదర్శనాలు, నూతన వ్యవహారాలు చేస్తారు.

మకరం: ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు..ఈరోజు ఎం చేసిన కూడా ఆచి తూచి చేయడం మంచిది.

కుంభం: అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు..ఈరోజు అంత మంచి రోజు కాదు..

మీనం: ఇంటా, బయట ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు..ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యాలు ఈరోజు తీరతాయి..

Read more RELATED
Recommended to you

Latest news