వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా…. అనే పదాలను అఖిలాంధ్రుల సమక్షంలో పలికేందుకు జగన్ శ్వాసించాడు. స్వప్నించాడు. పరితపించాడు. అదే లక్ష్యమై ముందుకుసాగాడు. ఒక దీక్షలా, యజ్ఞంలా సాగిపోతే ఏ నాటికికైనా, ఎంతటి లక్ష్యమయితా ఒడి చేరుతుందని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
జగన్ రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం..
పట్టుదల, కృషి, దీక్ష ఉంటే…… పట్టాభిషేకమే !
Push yourself, because no one else is going to do it for you
చిన్నపాటి గడ్డం.. ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు.. ఎవర్ని చూసినా ఆప్యాయంగా పలకరింపు.. అతి సామాన్యుడిగా వేషధారణ.. ఇవన్నీ చెబితే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అవును.. ఆయనే..! ఆయనే ఇప్పుడు యూత్ ఐకాన్.. ఇతర రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే యుక్త వయస్సులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టి.. సీఎంగా ఇంకా వారం రోజులు కూడా పూర్తి చేసుకోక ముందే అందరిచే భేష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రస్తుతం యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా…. అనే పదాలను అఖిలాంధ్రుల సమక్షంలో పలికేందుకు జగన్ శ్వాసించాడు. స్వప్నించాడు. పరితపించాడు. అదే లక్ష్యమై ముందుకుసాగాడు. ఒక దీక్షలా, యజ్ఞంలా సాగిపోతే ఏ నాటికికైనా, ఎంతటి లక్ష్యమయితా ఒడి చేరుతుందని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
ఒకప్పుడు నా అనే వాళ్లు, వ్యవస్థలు అన్నీ అతడిని వెలేశాయి. కృంగిపోలేదు… చింతించలేదు…చిన్నగా అతడే వ్యవస్థలను నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. అతడే నాయకులను తయారుచేయడం మొదలుపెట్టాడు. ఆటుపోట్లు, ఎదురుదెబ్బలకు వెరవలేదు. చివరికి విజయం సాధించాడు.
ఇప్పుడు అతడిని వెలేసిన మనుషులు, వ్యవస్థలన్నీ ఇప్పుడు అతడిని కీర్తిస్తున్నాయి. అతడి కరచాలనం కోసం, అతడి ఆలింగనం కోసం అర్రులు చాస్తున్నాయి. విజయం అంటే ఇది. మనల్ని చిన్నచూపు చూసిన వాళ్లు మన కంటిచూపుకోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూడడమే అసలైన విజయం.
జగన్ అది సాధించాడు. సగర్వంగా విజేతగా తలెత్తి నిలబడ్డాడు. దుర్భాషలాడిన నోళ్లు, వెక్కిరించిన నొసళ్లు, ఎగతాళిగా చూసిన కళ్లు.. ఇప్పుడు అన్నీ దిక్కుతోచనిస్థితిలో పడిపోయాయి.
నాడు తండ్రి మరణానంతరం కొన్ని పరిస్థితుల వల్ల తాను సొంతంగా పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని ధిక్కారంగా భావించిన ఢిల్లీ సేన దాడికి దిగింది. రోజుకో సీబీఐ కేసు, పూటకో చోట ఈడీ దాడులు, గంటకో భయపెట్టే వార్త, వారానికొక చార్జిషీటు, విచారణలు, కోర్టులు, అరెస్టులు, 18 నెలలపాటు జైలుజీవితం, పచ్చమీడియా చెత్తరాతలు.. ఇలా.. ఇంకొకడైతే ఢిల్లీ పీఠానికి తలవంచి సలాం కొట్టేవాడే..కానీ అతడు జగన్. వీటన్నింటినీ భరించాడు. దిగమింగాడు. కానీ, నమ్మకం కోల్పోలేదు. పట్టుదల సడలలేదు.
చిన్న కష్టానికే ఆత్మహత్యలవైపు వెళుతున్న నేటి యువత….. జగన్ పోరాటాన్ని కచ్చితంగా మననం చేసుకోవాల్సిందే. కష్టాన్ని బయటకు కనిపించనీయని అతడి నైజం, పెనుసవాళ్లు ముసురుకున్నా చెరగని అతడి చిరునవ్వు, ఏనాడూ, ఎవడికీ తలొగ్గని తెగువ.. ఇవన్నీ ఎప్పటికీ, అందరికీ ఆచరణీయ అంశాలే. స్ఫూర్తిప్రదాతలు ఎక్కడో ఉండరు. మన మధ్యే, మనల్ని పలకరిస్తూ తిరుగుతుంటారు.
కాంగ్రెస్‌పార్టీ వైఎస్ జగన్‌కు భవిష్యత్తు లేకుండా చేయాలని భావించింది. అందుకోసం ఢిల్లీ స్థాయిలో చాలా ప్రయత్నాలు జరిగాయి. చివరికి ఏమైంది.? కాంగ్రెస్‌పార్టీ నేలమట్టమయింది. జగన్‌ను కనీసం ప్రతిపక్షనాయకుడిగా చూడటానికి తెలుగుదేశం పార్టీ ఇష్టపడలేదు. కేవలం జగన్‌ను ఎదుర్కోవడానికి ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో చేతులుకలిపాడు చంద్రబాబు. అదే ప్రతిపక్షహోదా కోసం అక్కడ కాంగ్రెస్, ఇక్కడ టీడీపీ నానా తంటాలు పడ్డాయి. అంతకంతకూ ఎదుగుతూ వస్తున్న వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిన రోజు సైతం అతడి మొఖం లో కనిపించింది చిరునవ్వే తప్ప భయం కాదు.
వైఎస్ జగన్ జీవితం నేటి యువతకు ఓ మంచి పాఠం. కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు కుంగిపోకుండా పోరాడితే గెలుపు దానంతట అదే వస్తుందని చెప్పేందుకు అతడి జీవితం ఒక పాఠం. పోరాడితేనే ఓటమి పట్ల భయం పోతుంది. గెలుపు పట్ల నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది.
నేటి తరుణంలో జనాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు.. ఇలా వీఐపీలు, వీవీఐపీలు అందరూ సామాజిక మాధ్యమాలే వేదికగా తమ అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇక ఆ విషయంలో సీఎం జగన్ విషయానికి వస్తే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకే సుమారుగా 2 లక్షల మంది ఫాలోవర్లు ఆయన ఖాతాలో చేరారు. ట్విట్టర్‌లో ప్రస్తుతం సీఎం జగన్‌కు 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
సీఎంగా జగన్ ప్రమాణం చేసిన వెంటనే వైఎస్సార్ పెన్షన్ పథకం ఫైలుపై తన తొలి సంతకం చేసి వృద్ధులకు ఇచ్చే ఫించను రూ.3వేలకు పెంచారు. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏటా రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆశ వర్కర్లకు జీతం రూ.10వేలు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ అందరి దృష్టిలో హీరో అయ్యారు. ఎప్పుడు చూసినా సింప్లిసిటీతో కనిపించే ఆయన ఇప్పుడు యూత్‌కు ఆదర్శంగా, ప్రేరణగా నిలుస్తున్నారు. మరి ముందు ముందు జగన్ ఇంకా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూస్తే తెలుస్తుంది..!