స్ఫూర్తి: ఆరేళ్ళ బాబుని వదిలేసి ఐపీఎస్ ట్రైనింగ్ కి వెళ్లారు..ఈమె సక్సెస్ స్టోరీ చూస్తే శభాష్ అంటారు..!

-

కొంత మంది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. నిజానికి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని నడుచుకుంటే మనం కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలం. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఎన్ని ఆటంకాలు వస్తున్నా సరే వాటిని దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించొచ్చు.

ఐపీఎస్ అయ్యి తన భర్తకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఐపీఎస్ కావాలని లక్ష్యం కోసం ఆరేళ్ల బాబుని వదిలేసి ట్రైనింగ్ కి వెళ్లారు ఈమె. ట్రైనింగ్ లో కూడా బెస్ట్ ట్రైనీ ఐపీఎస్ అనిపించుకున్నారు. అలానే ఈమె ఆఖరి కి బ్యాచ్ లో లేడీ ప్రొబేషనరీ అవుట్డోర్ టాపర్ గా నిలిచారు.

ఈమె పేరు నిత్య రాధా కృష్ణన్. నిత్యా రాధా కృష్ణన్ తమిళ నాడు రాష్ట్రం లోని సేలం జిల్లా కి చెందిన ఆమె. సాఫ్ట్వేర్ లో మంచి ఉద్యోగం లక్షల జీతం వున్నా సరే ఏదో లోటు ఉంటుందని దాన్ని వదిలేశారు. ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ లో పని చేశారు. అది కూడా మంచి ఉద్యోగమే అయినా ఆమె సంతృప్తి చెందలేదు.

ఐపీఎస్ అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. పెళ్లి అయ్యి బాబు ఉన్న తర్వాత ఐపీఎస్ అవ్వాలనిపించింది. ఆడవాళ్లు కూడా వాళ్ళ కి నచ్చినది చేయొచ్చు ఆడవాళ్లు కూడా ఇటువంటి రంగాలని ఎంచుకోవచ్చు. చాలా మంది ఆడవాళ్లు ఇటువంటి ఉద్యోగాలు పురుషులకే మంచిదని భావించి ఇలాంటి ఉద్యోగాలు చేయకూడదని అనుకుంటారు కానీ అలా ఏమీ లేదు. ఎవరైనా ఎవరికి నచ్చిన రంగంలోకైనా వెళ్లొచ్చు మనసుకి ఇష్టమైంది చేయండి. నిజానికి పట్టుదల ముందు ఏదైనా సరే తలవంచాలి. నో డౌట్.

Read more RELATED
Recommended to you

Latest news