కుటుంబం కోసం ఆనాడు గాజులమ్మాడు.. కట్‌ చేస్తే నేడు IAS ఆఫీసర్‌..

-

కష్టపడకుండా వచ్చే ఏ సుఖం కలకలాం నిలవదంటారు.. అలాంటి కష్టం కొందరికి కొంత కాలం ఉంటుంది. మరి కొందరికి జీవితాంతం ఉంటుంది. ఒకప్పుడు కనీసం కడుపు నిండా తినడానికి తిండి కూడా లేని స్టేజ్‌ నుంచి నేడు కోట్లకు అధిపతి అయిన వారు ఎంతో మంది ఉన్నారు.. రూ.50లకు కూడా ఉద్యోగం చేసిన స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్లు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు గాజులమ్మాడు..కృషి పట్టుదలతో శ్రమించి ఇప్పుడు ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయ్యాడు. మన లక్ష్యం గట్టిదైతే..చిక్కుముడలన్నీ ఉచ్చుముడిలా వచ్చేయాల్సిందే..ఈ స్పూర్తినింపే కథ పూర్తిగా మీకోసం..!

మహరాష్ట్రలోని పుణేకు చెందిన రమేశ్ ఘొలప్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి గాజులమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి అనారోగ్యంతో మరణించగా, ఆయన అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి వారిది. ఈ క్రమంలో కుటుంబ భారం తల్లిపైన పడింది. చిన్నప్పుడు రమేశ్ సైతం తల్లితో కలిసి గాజులమ్మాడు. అయితే పోలియో కారణంగా అతడి ఎడమ కాలు పని చేయకుండా పోయింది. అలా దివ్యాంగుడిగా మారినా, రమేశ్ గాజులమ్మి తన కుటుంబం కోసం కష్టపడ్డాడు.. తల్లితో కలిసి పని చేస్తూనే తన చదువులపై శ్రద్ధ వహించాడు.

తన తల్లి, అన్న కూడా గాజులు అమ్ముతూ కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు. దీంతో రమేశ్ ఉన్నత చదువుపై దృష్టి పెట్టాడు.. తన మామయ్య ఊరు బర్సికి వెళ్లి అక్కడ చదువుకున్నాడు. ఇంటర్‌లో 88 శాతం మార్కులు సంపాదించిన రమేశ్.. ఆ తర్వాత టీచింగ్‌లో డిప్లొమా చేసి సొంత ఊర్లోని స్కూల్‌లోనే టీచర్‌గా చేశాడు.. ఇక ఆ తర్వాత రమేశ్ తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. టీచింగ్ చేస్తూనే బీఏ డిగ్రీ పూర్తి చేసిన రమేశ్.. యూవీఎస్సీలో బెస్ట్ ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇలా ఆరు నెలల పాటు ప్రిపేర్ అయి 2010లో యూపీఎస్‌సీ (UPSC) ఎగ్జామ్ అటెమ్ట్ చేశాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా పరీక్ష రాయగా, క్వాలిఫై కాలేకపోయాడు. తల్లి ఊరిలో అప్పు చేసి మరీ రమేశ్‌ను కోచింగ్‌కు పంపించింది. ఇలా సబ్జెక్ట్స్‌పై పట్టు సాధించి, 2012లో 287వ ర్యాంక్ సాధించి యూపీఎస్‌సీ క్లియర్ చేశాడు. దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాడు.

మధ్యతరగతి వారి జీవితాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ఎన్ని కష్టాలైనా రానివ్వండి.. ఎట్టిపరిస్థితుల్లో చదువును మాత్రం పక్కనపెట్టకంకండి. చదువుకునే రోజుల్లో చదువు విలువ అస్సలు తెలియదు. విలువ తెలిసే సమయానికి ఏజ్‌ ఉండదు. చదువు ఒక్కటే పేదవాడి ఆస్తి. చదువు ఉంటే చాలు అన్నీ అవే వస్తాయని పెద్దోళ్లు ఊరికే చెప్పరుగా..!

Read more RELATED
Recommended to you

Latest news