లోపం ‘దృష్టి’లోనే.. ప్రయత్నంలో కాదంటున్న కుర్రాడు..మైక్రోసాఫ్ట్‌లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

-

జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటేనే మనకు చదవడానికి, జాబ్‌ తెచ్చకోవడానికి కష్టమైతుంది. అలాంటిది కళ్లు లేకుండా బతకడమే భారం…కానీ లోపాన్ని సాకుగా చేసుకోకుండా..ఆ కుర్రాడు..చదువుకుని మైక్రోసాఫ్ట్లో. లక్షల ప్యాకేజ్‌తో జాబ్‌ కొట్టాడు. ఇతని స్టోరీ నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. చిన్న చిన్న సమస్యలకే నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నిట్టూర్చే వాళ్లకి ఇలాంటి స్పూర్తినిచ్చే కథలు కాస్తానే మందులా పనిచేస్తాయని ఆశిస్తున్నాం..

ఇండోర్‌కు చెందిన యష్ సోంకియా అనే విద్యార్థికి మైక్రోసాఫ్ట్ లక్షలాది రూపాయల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇచ్చింది. ముగ్గురు తోబుట్టువులలో పెద్దవాడైన యష్ చిన్నతనం నుంచి దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. యష్ ఇండోర్‌లోని శ్రీ గోవింద్రం సెక్సరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ చేశాడు.. మైక్రోసాఫ్ట్ అతనికి 15 లక్షల ప్రాథమిక ప్యాకేజీని ఆఫర్ చేసింది. అలాగే తమ కంపెనీ షేర్లను కూడా కేటాయించింది.

యష్‌ తన జీవితం గురించి ఏమంటున్నారో తన మాటల్లోనే..‘ప్రారంభంలో ఇది చాలా కష్టమైన పని. కానీ నెమ్మదిగా, స్థిరంగా ప్రతిదీ అలవాటైంది. నా కళాశాల, నా స్నేహితులు నాకు చాలా సహాయం చేశారు. ఇంటర్నెట్ నాకు చాలా సహాయపడింది. చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. అయితే తోటి వ్యక్తుల నాకు అండగా నిలిచారు. దృశ్యపరంగా నిస్సహాయంగా భావించే వికలాంగులు ప్రతి రంగం అందరికీ కాదని అర్థం చేసుకోవాలి. దానికి బదులు వారు తాము చేయగలిగిన చోట 100 శాతం కృషి చేయాలి..’ అని యష్ అంటున్నారు.

యశ్ తండ్రి యశ్‌పాల్ మాట్లాడుతూ..‘నేను హైస్కూల్ వరకు చదివాను. నా కొడుకు మైక్రోసాఫ్ట్ నుంచి ఉద్యోగం పొందుతాడని నేను అస్సలు ఊహించలేదు.. అయితే అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుతాడనే నమ్మకం నాకు ఉండేది. నా కొడుకు నా గర్వం. ఈ రోజు అతను తనను తాను నిరూపించుకున్నాడు..’ అని యశ్‌పాల్ ఆనందగా చెప్పారు. 2021 కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన యష్‌కి ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇచ్చింది. మనలో కృషి, పట్టుదల, సాధించాలనే కసి బలంగా ఉంటే..అడ్డంకులు అవే చిన్నబోతాయని యష్‌ ద్వారా మరోసారి రుజువైంది.

Read more RELATED
Recommended to you

Latest news