సాధారణంగా పిల్లలకు ఐక్యూ 80 నుంచి 85 మధ్య ఉంటే.. ప్రియాంకకు మాత్రం 65 నుంచి 70 వరకు మాత్రమే ఉండేది. దీంతో ఆమెకు ట్రెయినింగ్ ఇవ్వడాన్ని ఓ చాలెంజింగ్‌గా తీసుకొని… ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు..
సాధారణంగా మనుషులకు తెలివితేటల స్థాయి ఎలా ఉంటుందో, ఎంత మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు చేసే పరీక్షే ఐక్యూ టెస్ట్. ఆ టెస్ట్‌లో ఆ అమ్మాయికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అంటే ఆమెకు చాలా తక్కువ తెలివి ఉందని డాక్టర్లే సర్టిఫికెట ఇచ్చారు. చిన్నప్పుడు ఆ అమ్మాయికి మాటలు కూడా చాలా లేట్‌గా వచ్చాయి. అన్నింటిలోనూ లేటే. చదువులోనూ వెనుకబడిపోయిన ఆ అమ్మాయి ఇప్పుడు ప్రత్యేక ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచింది. స్కేటింగ్‌లో మూడు పతకాలు గెలిచి.. భారత్ సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఆ అమ్మాయే ప్రియాంక దివాన్. ఆమెది ఢిల్లీ. వయసు 19 ఏళ్లు. రీసెంట్‌గా యూఏఈలోని అబుదాబిలో జరిగిన ప్రత్యేక ఒలింపిక్స్ పోటీల్లో మూడు పతకాలు.. ఒకటి బంగారం, మరొటి వెండి, ఇంకో రజతం గెలిచి వారెవ్వా అనిపించింది.
ప్రియాంకకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకే చిన్నప్పటి నుంచి స్కేటింగ్ చేయాలన్న కోరికను తన తల్లిదండ్రులకు చెప్పేది. దీంతో స్కేటింగ్ ట్రెయినర్ ప్రభాత్ శర్మ వద్ద ప్రియాంకకు ట్రెయినింగ్ ఇప్పించారు. సాధారణంగా పిల్లలకు ఐక్యూ 80 నుంచి 85 మధ్య ఉంటే.. ప్రియాంకకు మాత్రం 65 నుంచి 70 వరకు మాత్రమే ఉండేది. దీంతో ఆమెకు ట్రెయినింగ్ ఇవ్వడాన్ని ఓ చాలెంజింగ్‌గా తీసుకొని… ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఒలింపిక్ మెడల్స్ సాధించేలా ట్రెయినింగ్ ఇచ్చారు కోచ్.