కల్లు గీసే అమ్మాయి..ఏడాదికి ఎంత ఆదాయమో తెలుసా?

-

కల్లు తియ్యడం అనేది మగవాళ్ళకే కష్టం అని ఈ మధ్య కొందరు గీతా కార్మికులు చెబుతున్నారు. కష్టపడి చెట్లు ఎక్కి కల్లు తీసినా కూడా పెద్దగా ఆదాయం లేకపోవడంతో చాలా మంది కల్లు తియ్యడానికి ఆసక్తి చూపించ లేదు..అయితే ఓ అమ్మాయి కల్లును సులువుగా ఎలా తియ్యాలి. ఎంత ఆదాయం పొందవచ్చు అనే విషయాల పై అవగాహన కల్పిస్తుంది..ఇప్పుడు కొందరు కార్మికులు లక్షలను సంపాదిస్తున్నారు.. ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

60 మంది కొబ్బరి రైతులకు ఆమె కల్లు గీయడం నేర్పించింది. ఈ విషయమై అందరూ శ్వేతను విపరీతంగా మెచ్చుకుంటున్నారు.మొదట ఈమె ఇంజినీరింగ్ చేద్దామని కోచింగ్‌ మొదలెట్టింది. కాని ఎందుకో ఆమెకు బి.ఏ అగ్రికల్చర్‌ కోర్సు చేయాలనిపించింది. సాధారణంగా గోవాలో ఈ కోర్సు చేసేవాళ్లు తక్కువ. కోర్సు పూర్తయ్యాక శ్వేతా బెంగళూరులో ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్లింది.అక్కడ టిష్యూ కల్చర్‌ గురించి పరిశోధన. ఒక సీడ్‌ నుంచి వేలాది సీడ్‌లను ఎలా ఉద్భవించేలా చేయవచ్చో శ్వేతా పరిశోధన చేస్తుంటే హటాత్తుగా లాక్‌డౌన్‌ వచ్చి ఉద్యోగం పోయింది. శ్వేత గోవాకు తిరిగి వచ్చి ఒక కొబ్బరితోటలో మేనేజర్‌ ఉద్యోగానికి కుదిరింది.

గత ఏడాది లాక్ డౌన్ తోట పనులు మొత్తం చూసుకొనేది..ఈ క్రమంలో చెట్టు ఎక్కాలని అనుకుంది.చిటారుకు వెళ్లాక ఆమెకు కొబ్బరి కల్లు తీయడం గుర్తుకొచ్చింది. చదువులో భాగంగా ఆ పని తెలిసిన శ్వేత మరుసటి రోజు కొబ్బరి కల్లు గీత మొదలెట్టింది.తను పని చేస్తున్న తోటలో కల్లు గీయడం ప్రారంభించే సరికి చుట్టుపక్కల వారికి తెలిసి చూడటానికి రావడం మొదలెట్టారు. తాటి కల్లు, ఈత కల్లులాగే కొబ్బరి కల్లు కూడా దేశీయ పానీయం. అందుబాటులో లేక గాని తాగే వారి సంఖ్య తక్కువేం కాదు గోవాలో. ఇప్పుడు శ్వేత వల్ల కొబ్బరి కల్లు పట్ల ఆసక్తి మొదలైంది.

గోవాలో కొబ్బరి చెట్లు లక్షల్లో ఉంటే కొబ్బరి కల్లు గీసే కార్మికుల సంఖ్య కేవలం 200 ఉంది. ప్రభుత్వం, ఉద్యానవన శాఖలు ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులు ఎత్తేశాయి. కారణం చెట్టెక్కడంలో ఉన్న రిస్కు, ఆదాయం అంతంత మాత్రమే ఉండటం..అయితే ఇప్పుడు శ్వేత ఇప్పుడు కొత్త మెలుకువలు గురించి తెలియజెసింది.దాంతో అక్కడి వారి ఆదాయం కూడా రెట్టింపు అయ్యింది.60 మంది కొబ్బరి రైతులకు ఆమె కల్లు గీయడం నేర్పించింది. ఈ విషయమై అందరూ శ్వేతను విపరీతంగా మెచ్చుకుంటున్నారు.దీంతో అందరికి మార్గదర్సంగా నిలిచింది.. గ్రేట్ ఐడియా కదా..

Read more RELATED
Recommended to you

Latest news