నెయ్యి అమ్ముతూ నెలకు లక్షలు సంపాదిస్తున్న యువతి..

ప్రస్తుత కాలంలో మనుషులకు ఆరోగ్యం పై శ్రద్ద బాగా పెరిగింది.ముఖ్యంగా సమ్మర్ లో..వేడి నుంచి తట్టుకోవడం కోసం హోమ్ టిప్స్ ను పాటిస్తున్నారు. ఏం తినాలి..ఎంత తినాలి..ఎలా తీసుకోవాలి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుంటున్నారు. సేంద్రియ పద్దతుల ద్వారా పండించిన పంటలకు, కూరగాయలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది..ఎంత ఖర్చు అయిన కూడా ఇలాంటివి తింటున్నారు.ఇలాంటి వాటిని వ్యాపారంగా మార్చుకొని లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నాయి..

తాజాగా ముంబాయిలో కొందరు మహిళలు వ్యాపారంగా మలచుకున్నారు.నిత్య, జయలక్ష్మీ గణపతి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే నెయ్యిని తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంట్లో తయారు చేసే మంచి సువాసన కలిగిన నెయ్యికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నట్లు నిత్య, జయలక్ష్మీ తెలుసుకున్నారు.మెల్లగా దానిని వ్యాపారంగా మార్చుకున్నారు.నెయ్యిని ‘ద్రవ బంగారం’గా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. నెయి నేటివ్, ముంబై నివాసి నిత్య గణపతి యొక్క ఆలోచన, నెయ్యి తయారు చేసే సాంప్రదాయ పద్ధతిని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 2021లో నెయి నేటివ్ ను ప్రారంభించింది. ఆమె తల్లి జయలక్ష్మి గణపతి ఆమెకు బాగా మద్దతు ఇస్తుంది.నిత్య, జయలక్ష్మీ గణపతి ప్రారంభించిన నెయి నేటివ్ కొంత కాలానికే మంచి ఆదరణ సాధించుకుంది.

మొదట్లో రోజుకు 10 ఆర్డర్ లు వస్తే ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగింది.ప్రస్తుతం 90 కి పెరిగింది.దాంతో నెలకు 3000 వరకు ఆర్డర్ లు వస్తున్నాయి..2021లో నెలకు రూ. 1 లక్ష విక్రయాలతో ప్రారంభించిన ఈ బ్రాండ్ ఇప్పుడు నెలవారీగా రూ. 10 లక్షల విక్రయాలకు చేరుకుందని నిత్య చెప్పారు. 250-మి.లీ జార్ నేయి ధర రూ. 750 వరకు ఉంటుంది. అయితే 500-మి.లీ జార్ ధర రూ. 1,350 కంటే ఎక్కువ. ప్రస్తుతం బ్రాండ్ నుండి నెయ్, కాఫీ పౌడర్, తేనె మరియు థెరట్టిపల్ (మిల్క్ డెజర్ట్) కొనుగోలు చేయవచ్చు..భవిష్యత్తులో మరి కొన్ని ఉత్పత్తులను పెంచుకుంటూ వస్తామని వారు పేర్కొన్నారు..