అవునా.. ఏముంది ఈ వీడియోలో అని తీసిపారేయకండి. ఆ వీడియోలో ఓ భావోద్వేగం ఉంటుంది. ఓ బాధ, తపన… అన్నింటినీ మించి తనను ఎవరూ పట్టించుకోవట్లేదనే ఆవేదన. అన్నింటినీ కలగలిపి ఉన్న ఆ వీడియో మనల్ని పిండేస్తుంది. ఆ వీడియో చూశాక.. కన్నీటి బొట్లు రాల్చాల్సిందే. కన్నీటి రూపంలో అయినా.. మన ఒంట్లోని అసూయ, ద్వేషం అన్నీ బయటికి పంపే చాన్స్ ఉంటుంది. సరే.. అసలు విషయానికి వద్దాం.
హెచ్‌పీ కంపెనీ తెలుసు కదా. ఆ కంపెనీ ప్రతి సంవత్సరం దీపావళికి ఓ స్పెషల్ వీడియోను రూపొందిస్తుంటుంది. ఈ సారి కూడా ఓ వీడియోను రూపొందించింది. కానీ.. ఈ సారి రూపొందించిన వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు నెటిజన్ల గుండెల్ని పిండేసింది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఏడ్చేశారు. కొంతమందికి జ్ఞానోదయం కూడా అయింది. వీధిలో దీపావళి ప్రమిదలు అమ్ముకునే ఓ మహిళపై తీసిన వీడియో ఇది. ఇప్పుడంతా మాల్స్ జనరేషన్ కదా. ఏది కొనుక్కోవలన్నా మాల్‌కు వెళ్లాల్సిందే. ప్రతి వస్తువు మాల్‌లో దొరుకుతుంది. దాని వల్ల వీధి వ్యాపారులు దెబ్బతింటున్నారు. వాళ్లకు ఉపాధి లేకుండా పొతుందన్న నేపథ్యంలో తీసిన వీడియో ఇది. ఇంతకన్నా ఎక్కువ చెప్పను. జస్ట్.. ఓ కర్చీఫ్ పక్కన పెట్టుకొని ఈ వీడియో చూసేయండి అంతే..