విజయం సాధించాలంటే ఈ అలవాట్లు ఖచ్చితంగా ఉండాల్సిందే..

-

విజయం సాధించాలనుకునే వారికి ఎలాంటి అలవాట్లు ఉండాలి. ఎలాంటి అలవాట్లు ఉంటే విజేతలుగా ఎదుగుతారు అనే విషయాలు అందరికీ ఆసక్తిగా ఉంటాయి. జీవితంలో అందరూ ఆశగా ఎదురుచూసేది విజయం కోసమే. అందుకే విజయం సాధించడానికి ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

గెలుపు కోసం తపించేవాళ్ళు కామ్ గా ఉండడం నేర్చుకోవాలి. అందుకే రోజులో ఒక ఐదు నిమిషాల పాటు సైలెంట్ గా ఉండండి. ఇది ధ్యానం లాంటిది కాదు. శ్వాస మీద ధ్యాస అసలే కాదు. దీనికోసం మేరేమీ కష్టపడనక్కర లేదు. సింపుల్ గా సోఫాలో కూర్చుని సైలెంట్ గా ఉండండి. ఒక ఐదు నిమిషాల పాటు జస్ట్ నిశ్శబ్దంగా ఉండడం అలవాటు చేసుకోండి.

రోజు ఒక ఐదు నిమిషాల పాటు ఈ రోజు ఏం చేసారో గుర్తు చేసుకోండి. ఇంకా ఏం మిగిలిపోయాయో ఒక లిస్టు తయారు చేసుకోండి. దానివల్ల రేపేం చేయాలో గుర్తుంటుంది. అలాగే ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారో జ్ఞప్తికి వస్తుంది.

డైలీ ఒక కొత్త పదం నేర్చుకోండి. నేర్చుకోవడమే కాదు ఆ పదాన్ని మీ డైలీ కమ్యూనికేషన్లో వాడుతూ ఉండండి. మీ మెదడుకి పని పెడుతూ ఉంటే చురుగ్గా తయారవుతుంది. అందువల్ల రోజూ ఒక కొత్త పదం నేర్చుకోండి.

విజయం సాధించడానికి కావాల్సిన ముఖ్యమైన వాటిల్లో ఎదుటి వారికి గౌరవం ఇవ్వడం. అందుకే రోజులో మీకు వచ్చిన మిస్డ్ కాల్స్, మెసెజెస్ కి రిప్లై ఇవ్వండి. మీకు టైమ్ లేకపోతే కనీసం ఆ విషయం వారికి తెలియజేయండి. ఎవరు ఏ పని మీద కాల్ చేసారో తెలియదు కాబట్టి, వారికి రిటర్న్ కాల్ చేసి తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news