ఈ డివైజ్‌తో వీధి కుక్కలు ఇక మీ వెంట పడవు.. సేఫ్‌ రైడింగ్‌కు సెఫ్టీ డివైజ్..!

-

Device: ఈ మధ్యకాలంలో కుక్కల పంచాయితీ ఎక్కువైపోయింది.. రోడ్డుపై నడిచి వెళ్లేవాళ్లని, బైక్‌పై వెళ్లేవాళ్లని వదలడం లేదు. హైదరాబాద్‌లో అయితే మొన్నటికి మొన్న ఈ వీధి కుక్కల వల్ల స్కూటీపై వెళ్లే వాళ్లు గాల్లో ఎగిరి బొక్కబోర్లాపడ్డారు. అది రద్దీలేని రోడ్డు కాబట్టి సరిపోయింది.లేకుంటే.. ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి. ఇలాంటి ఘటనలు రోజు ఎన్నో.. బైక్‌ పై వెళ్తుంటే.. కుక్కలు తరమడం కామన్‌.. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. ఒక డివైజ్‌ కనిపెట్టాడు ఓ వ్యక్తి. సేఫ్ బైక్ రైడ్‌ కోసం ఒక వ్యక్తి అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్‌ (Ultrasonic Dog Repellent) అనే డివైజ్‌ను డెవలప్ చేశాడు. కుక్కలు బైక్‌ను ఛేజ్ చేయకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఎలా పనిచేస్తుంది?

అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ డివైజ్ అనేది హై-ఫ్రీక్వెన్సీ శబ్దాలను విడుదల చేస్తుంది. తద్వారా బైక్‌ నడుపుతున్నప్పుడు కుక్కలు రైడర్ వద్దకు రాకుండా లేదా దాడి చేయకుండా ఆపుతుంది. ఈ అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ అనేది రైడర్ బైక్‌కి వెనుక భాగంలో జోడించాలి. ఈ డివైజ్ మానవ వినికిడి పరిధికి మించిన హై-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది కుక్కలకు పెద్దగా వినిపిస్తుంది కానీ మనుషులకు తీవ్రంగా వినిపించదు.

ఈ ఫ్రీక్వెన్సీకి కుక్కలు భయపడిపోయి సైకిల్ లేదా బైక్‌ను తరమడం మానేస్తాయి. ఈ డివైజ్ జంతువులకు ఏ విధంగానూ హాని కలిగించదు, కానీ దూకుడుగా ఉండే వీధి కుక్కల సమస్యను మాత్రం తగ్గిస్తుంది.

డివైజ్ సామర్థ్యం

నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఈ డివైజ్‌ నిజంగానే కుక్కలను ఆమడ దూరం ఉంచుతుంది.. వైరల్ అవుతున్న వీడియోలో ఈ డివైజ్‌ పనితీరు కూడా స్పష్టంగా తెలిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడిట్‌(Reddit)లో షేర్ చేసిన వీడియో చూస్తుంటే మనకు ఒక బైక్ లేదా సైకిల్‌పై ఒక వ్యక్తి వేగం గా వెళ్తుండటం చూడవచ్చు. అయితే వీధిలోని కుక్కలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. దాంతో సదరు బైకర్ తన అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్‌ను ఆన్ చేశాడు. అంతే, చాలా దూకుడుగా వెంటపడిన కుక్కలు ఆ శబ్దం విని తోకముడిచి తిరుగు ముఖం పట్టాయి. ఇలా వీధి కుక్కలు వెంటపడిన ప్రతిసారీ ఆ వ్యక్తి అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్‌ను ఆన్ చేస్తూ సౌండ్ రిలీజ్ చేశాడు. ఆ శబ్దానికి భయపడిన కుక్కలు వెనక్కు పరుగెత్తాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. నిజంగా ఈరోజుల్లో ఇలాంటి ఒక పరికరం ప్రతి బైక్‌ రైడర్‌కు కావాలి.

Man makes an ultrasonic dog repellant for his bike, to stop dogs from attacking him on his route.
by u/firefly99999 in Damnthatsinteresting

Read more RELATED
Recommended to you

Latest news