అక్కడ 300 ఏళ్లుగా రాఖీ పండుగ చెయ్యలేదట..కారణం ఇదే?

-

ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా రాఖీ పౌర్ణమి మరి కొద్ది రోజుల్లో అంటే ఆగస్టు 11 తారీఖూ వచ్చేస్తుంది..ఈ పండుగను జరుపుకునేందుకు దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం కాస్త ముందుగానే రాఖీలను ప్రదర్శనకు పెట్టి అమ్ముతున్నారు మార్కెట్లలో. ఏటా వైవిధ్యభరితమైన రాఖీలు దర్శనమిచ్చినట్లే.. ఈసారి కూడా కలర్‌ఫుల్ రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. సోదర, సోదరీ బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మన దేశంలో అన్ని మతాల వారూ జరుపుకుంటారు. ముఖ్యంగా హిందువులకు ప్రధానమైన పండుగల్లో ఇదీ ఒకటి.

ఈ పండుగకు ప్రత్యేక చరిత్ర ఉంది.దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ పండుగను జరుపుకుంటున్నారు. కొంతమంది సోదరీమణులు.. విదేశాల్లోని తమ సోదరులకు పోస్టల్ సర్వీస్ ద్వారా రాఖీలు పంపుతున్నారు. మరి ఇంతలా జరుపుకునే ఈ వేడుకను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం అస్సలు ఈ పండుగను జరుపుకోరు..అందుకు బలమైన కారణం ఉందని అంటున్నారు.. అదేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హార్పూర్ జిల్లాలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షా బంధన్ జరుపుకోరు. అంటే… అందరిలా జరుపుకోరు. వారు జరుపుకునే విధానం పూర్తి వేరుగా ఉంటుంది. దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ పండుగను వేరే విధంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కలప కర్రల కు రాఖీలు కడతారు. అందువల్ల పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి..

ఇకపోతే మీరట్ లో సురానా అనే గ్రామం ఉంది. అక్కడ శాపం అనే కారణంతో రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్లోని అందర్నీ చంపేశాడు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం బతికారు. ఎందుకంటే వారు ఆ రోజున ఊళ్లో లేరు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ల వారు అక్కడ నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు… దివ్యాంగుడిగా మారిపోయాడట… అందుకే అక్కడ 300 ఏళ్లుగా రాఖీ పండుగను బ్యాన్ చేశారు.. అప్పటి నుంచి అక్కడ రాఖీ మాట వినిపించదు..ఇలా ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రాఖీ పండుగ నిషేధం…అది అసలు కథ..

Read more RELATED
Recommended to you

Latest news