sweating: అసలే ఇది ఎండాకాలం.. చెమటలు పట్టడం పిచ్చ కామన్.. ఇంట్లో ఉన్నా ఫ్యాన్ లేదంటే చెమటలు ధారలే.. ఇక తలలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయిల్ పెట్టిన తలకు త్వరగా చెమటలు పడతాయి.. తలలో చెమటలు పట్టడం వల్ల కూడా జుట్టు ఊడుతుంది. చుడ్రు సమస్య కూడా వస్తుంది.. అయితే ఇలా మీకు కూడా తలలో చెమటలు పడుతుంటే.. కొన్ని చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడండి.. అవేంటంటే..
జుట్టులో చెమట సమస్యను ఇలా తగ్గించుకోండి
షాంపూను సరైన సమయంలో వినియోగించండి- వేసవిలో ప్రతి రోజు తల స్నానం చేయడం చాలా మంచిది. తప్పకుండా ఆర్గినిక్ షాంపులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఇలాంటి షాంపూలతో స్నానం చేయడం వల్ల జుట్టులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా చమట సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి సమ్మర్‌లో ప్రతి రోజు తల స్నానం చేయాలి. రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూను ఎంచుకోండి.
ఆపిల్ వెనిగర్- యాపిల్ వెనిగర్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేడి నీటిలో కలిపి తలకు మసాజ్ చేసి..అలాగే 20 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ జుట్టుకే కాదు.. మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది.
నిమ్మరసం- నిమ్మరసంలో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది.. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది. అయితే ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు దుర్వాసన రాకుండా ఉంటుంది. దీనిని అప్లై చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోని.. వాటి నుంచి రసం తీసి.. నీటిలో కలపండి.. అందులోనే ఆపిల్ వెనిగర్ వేసి జుట్టుకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సమ్మర్‌లో జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయి. జుట్టుకు డైరెక్టుగా నిమ్మరసం మాత్రం అప్లై చేయకండి..
తలలోంచి చెమటలు బాగా వస్తున్నవాళ్లు..తలకు ఆయిల్ పెట్టి రోజుల తరబడి అలానే ఉండకండి. ఆయిల్ రాసి ఒక గంట ఉంచి వెంటనే తలస్నానం చేయండి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయేప్పుడు తలకు ఆయిల్ ఉంటే.. మీ ముఖంపై మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంది.