నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నారా..?దీనికి సైంటిఫిక్‌ రీజన్‌ ఏంటంటే..

-

రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏవేవో కలలు, కలలో అరుస్తాం..ఉలిక్కిపడి లేస్తాం.. కిందపడిపోతున్నాం అన్నట్లు ఉంటుంది. అసలు నిద్రలో ఎందుకు ఉలిక్కిపడతాం..? దీని వెనుక ఉన్న సైంటిఫిక్‌ రీజన్‌ ఏంటి. ఎవరో ఒక్కరి ఇద్దరికి జరిగిదే వాళ్ల అనారోగ్య సమస్య అనుకోవచ్చు..కానీ దాదాపు అందరికి ఏదో ఒకసారి ఇలా జరిగే ఉంటుంది.

Waking up in the Middle of the Night? Light May Play a Role

హిప్నిక్ జర్క్స్..శాస్త్రవేత్తలకు, వైద్యులకు అంతుబట్టని ఓ శారీరక లక్షణం. మనకే కాదు జంతువులకు కూడా ఇలానే జరుగుతుందట..ప్రపంచంలో ఉన్న మనుషుల్లో 70శాతం మంది హిప్నిక్ జర్క్స్‌ను చాలా కామన్‌గా ఎక్స్ పీరియన్స్ చేస్తూ ఉంటారు. మరి దీనికి రీజన్ ఏంటీ. వైద్యులు ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే ఈ జర్స్క్‌కి కారణం మన మెదడే.

మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీ మొత్తం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మజిల్స్ రెస్ట్‌లోకి వెళ్లిపోతుండగానే మనం నిద్రలోకి జారుకుంటాం. అయితే మన బ్రెయిన్ దీన్ని రాంగ్‌గా అర్థం చేసుకుంటుంది. మనం పడిపోతున్నామో అని భావించి హిప్నిక్ జర్క్‌ను క్రియేట్ చేస్తుందట. ఒకవేళ మనం పడిపోతున్నామని మనం అర్థం చేసుకోవాలని మనం ఎక్కడో నడుస్తున్నట్లు అక్కడ జారిపడిపోయినట్లు ఓ కలను కూడా క్రియేట్ చేస్తుందంట మెదడు. సో కలలో పడిపోయాం కాబట్టి..హిప్నిక్ జర్క్ వచ్చి వెంటనే మెలకువ వచ్చి నిద్ర లేచి అలెర్ట్ అవుతాం.

Waking Up Too Often? - Ask Dr. Weil

బ్రెయిన్ ఒక్కోసారి మనం చనిపోతున్నామో అని కంగారుపడిపోయి లోపల నానా హైరానా పడిపోతుంది.. మనం నిద్రపోతున్నా కూడా..మన బ్రెయిన్‌, హార్ట్‌ మాత్రం వాటి పని అవి చేసుకుంటాయి.. నిద్రలో చనిపోతున్నామో అని బ్రెయిన్‌కు డైట్‌ వస్తే.. అన్ని శరీర భాగాలకు ఓ కరెంట్‌ను పంపి ఒక్కసారిగా అలెర్ట్ చేస్తుంది. అందుకే నిద్రలేచి వెంటనే ఆయాసపడతాం..గుండె దడగా కొట్టుకుంటూ ఉంటుంది. చెమటలు పడతాయి. శరీరంలో అన్ని అవయవాలు బీ అలెర్ట్ అన్నట్లు అయిపోతాయి. ఇది కూడా మెదడు పనే…

ఈ రీజన్‌ అయితే కాస్త క్రేజీగానే ఉంటుంది.. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఆదిమానవుల్లా ఏ చెట్ల కొమ్మలపైనో నిద్రపోయి ఉంటారు. వాళ్లు అలా నిద్రపోతూ కూడా..పడిపోకుండా అప్రమత్తంగా ఉండటం సడెన్‌గా నిద్రలేచి చూసుకోవటం చేసేవారు. ఆ అలెర్ట్ అనేది తరతరాలుగా ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత DNA కాపీగా వస్తూనే ఉంది.. మనం ఈరోజు. సుఖంగా బెడ్‌ మీద పడుకున్నా.. వాళ్ల డీఎన్‌ఏ తాలుకా..లక్షణాలు మనలో ఉన్నాయి కాబట్టి..మనం అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కిపడి లేస్తాం.

వీటితో పాటు.. మీరు పడుకున్న ప్లేసును బట్టి కూడా ఉలిక్కిపడి లేస్తారు. అంటే ఆపీసులో నిద్రపోతే మనకు ముందే తెలుసు..ఎవరైనా చూస్తారా అని.. అందుకే..నిద్రపోయినా ఉలిక్కిపడి లేస్తాం.. యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవి కూడా హిప్నిక్ జర్క్స్ కి కారణం.

Read more RELATED
Recommended to you

Latest news