మీ పిల్లలకు కళ్లకలతలు వస్తున్నాయా..? జాగ్రత్త కొత్త వేరియంట్‌ లక్షణం..!

-

New variant: కరోనా కేసులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. వైరస్‌ పేర్లు మార్చుకోని రూపాంతరం చెందుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా వచ్చిన వేరియంట్ కొత్త లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్ XBB.1.18 వేగంగా విస్తరిస్తోంది. దీన్నే ఆర్క్టురస్ అని కూడా పిలుస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కేసులు ఘోరంగా పెరుగుతున్నాయి..

 

New variant
New variant

సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఆర్క్టురస్ అనేది అత్యంత వేగంగా వ్యాపిస్తున్న అంటువ్యాధి. ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ ఇది. ప్రస్తుతం యూఎస్‌లో అత్యంత ప్రబలంగా ఉన్న వేరియంట్ ఇదే. మార్చి నెలలో ఇది అమెరికాలో 1.1 శాతం కేసులు నమోదు అయ్యాయి.. ఏప్రిల్‌ మూడో వారం నాటికి ఇది 19. 8 శాతానికి చేరుకుంది. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ కొత్త వేరియంట్ ఎంత వేగంగా వ్యాప్తిస్తుందే చూడండి..

ఈ దేశాల్లో కూడా..

XBB.1.5 తర్వాత రెండవ అత్యంత ప్రబలమైన సబ్ వేరియంట్ ఇదే. సుమారు 73.6 శాతం కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్క్టురస్ కేసుల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది.. యూఎస్‌తో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, లిబియా, ఇరాన్, కువైట్, ఖతార్ సహా 33 దేశాలలో ఈ సబ్ వేరియంట్ కేసులు కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. అయితే ఇది భారతదేశంలో ఎక్కువగా ఉంది. కొత్త వేరియంట్ లక్షణాలు కూడా కొత్తగా ఉన్నాయి. సాధారణంగా కోవిడ్ లక్షణాలంటే జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు అధికంగా కనిపించేవి. కానీ ఈ ఆర్క్టురస్ సోకితే కళ్ళు గులాబీ రంగులోకి మారడం, అధిక జ్వరం కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.

భారత్‌ పరిస్థితి ఏంటి..

పింక్ ఐ అంటే కండ్ల కలక. చిన్న పిల్లల్లో ఎక్కువగా కండ్ల కలక ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు.. కంట్లో నుంచి ఎక్కువగా నీరు కారడం, కళ్ళు దురదగా ఎర్రగా మారిపోవడం ఈ కొత్త వేరియంట్ లక్షణాలు. ఈ సబ్ వేరియంట్ ఏడు నెలలో భారతదేశంలో మరోసారి కోవిడ్ విశ్వరూపం చూపించబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి 30 న 13,509 కేసులు నమోదు కాదా అప్పటి నుంచి ఇప్పటి వరకు 61 వేల కేసులు నమోదయ్యాయి.

లక్షణాలు ఇవే..

అమెరికన్ ఆకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం కండ్ల కలక ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది. పిల్లలకు దురద, కళ్ళు ఎర్రగా ఉంటే తల్లిదండ్రులు భయపడకుండా ముందుగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించడం ఉత్తమం.

సాధారణ కోవిడ్‌కి జ్వరం వస్తుంది. కానీ ఈ కొత్త వేరియంట్‌కి జ్వరం అధిక మోతాదులో ఉంటుంది.

పెద్దవారిలో 103 డిగ్రీలు లేదా అంత కంటే ఎక్కువ వస్తుంది.

మూడు నెలలు నుంచి మూడేళ్ళ పిల్లలకు అయితే 100.4 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది.

కండ్ల కలకతో పాటు జ్వరం వచ్చినట్టయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Read more RELATED
Recommended to you

Latest news