వేళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నాయా..? అయితే ప్రమాదమే… జాగ్రత్త సుమా..!

-

ఒక్కొక్క సారి మన వేళ్ళు తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి అటువంటప్పుడు మనకి దానికి కారణం తెలియదు. ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము. తరచూ వేళ్ళు తిమ్మిర్లు ఎక్కుతుంటే అసలు నెగ్లెక్ట్ చేయద్దు. ఎందుకంటే ఇది అనారోగ్య సమస్య కావచ్చు చాలా మంది చేతి వేళ్లలో తిమ్మిర్లు ఎక్కడము వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ కనుక మీకు అలా కలుగుతుంటే ఈ అనారోగ్య సమస్యలు అవ్వచ్చు.

 

డయాబెటిక్ న్యూరోపతి:

డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో సగం మందికి ఏదో రకంగా నరాలు దెబ్బతింటాయి ఈ కారణంగా చేతులు బలహీనంగా మారిపోయి.. తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి.

కార్పల్ టన్నుల్ సిండ్రోమ్:

చేతిలో ఉండే మధ్య నాడి కంప్రెస్స్ అయితే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అవుతుంది మంట, వాపు, చేతి వేళ్ళు తిమ్మిర్లు ఎక్కడ వంటివి కలుగుతాయి.

బి12 లోపం:

బి12 లోపం కనుక ఉన్నట్లయితే చేతులు కండరాల్లో తిమ్మిర్లు ఏర్పడతాయి అంతేకాక కండరాలు బలహీనంగా మారిపోతాయి. ఆకలి కూడా ఎక్కువగా వేయదు.

స్ట్రోక్:

తిమ్మిర్లు వస్తున్నట్లయితే స్ట్రోక్ కి సంకేతం అవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్ట్రోక్ అంటే మెదడు లోని భాగాలకు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది దీనితో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది.

పెరిఫరల్ న్యూరోపతి:

దీని కారణంగా వేళ్ళు చేతులు మిగిలిన అవయవాలు పై ప్రభావం పడుతుంది దీంతో తిమ్మిర్లు మంట నొప్పి వంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

స్లీపింగ్ పొజిషన్:

మీరు పడుకునే భంగిమ సరిగా లేకపోతే కూడా ఇది జరగొచ్చు చేతుల మీద మీరు పడుకున్నప్పుడు రక్తనాళాలు నరాలు ఒత్తిడికి గురవడం వలన ఈ సమస్య రావచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కనుక తరచూ ఈ సమస్య వస్తున్నట్లయితే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news