డేటింగ్ యాప్స్.. మీ ప్రొఫైల్ ఆసక్తిగా కనబడడానికి ఏం చేయాలంటే,

-

ఒక్కరే బార్ లో తాగుతూ కూర్చున్నప్పుడు, సముద్రతీరంలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు, ఏదైనా పర్యాటక ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళినపుడు కొత్తవాళ్ళు కలుస్తారు. చాలామటుకు ఇలాంటి ఫాంటసీలన్నీ సినిమాల్లోనే ఉంటాయి. ప్రస్తుతం తరం మారింది. కాలం మారింది. కలుసుకోవడానికి ముందు ఆన్ లైన్లో ఒకరొకొకరు సెట్ అవుతారా కాదా అని చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి డేటింగ్ యాప్స్(Dating apps) చాలా ఉపయోగపడుతున్నాయి. మహమ్మారి కారణంగానూ బయటకు వెళ్ళే వీలు లేదు కాబట్టి, ఇంట్లోనే ఉండి వర్చువల్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. దానివల్ల ఎంత మేర సంతోషం వస్తుందన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

డేటింగ్ యాప్స్/ Dating apps
డేటింగ్ యాప్స్/ Dating apps

అదలా ఉంటే, డేటింగ్ యాప్ ద్వారా ఇతరులతో కనెక్ట్ కావడానికి ఆకర్షణీయమైన ప్రొఫైల్ చాలా అవసరం. మీ ప్రొఫైల్ చూడగానే ఆసక్తిగా అనిపిస్తేనే ఒక క్షణం అక్కడ ఆగుతారు. లేదంటే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఆకర్షణీయమైన బయో ఉండాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

బయో ఏ విధంగా ఉండాలంటే

18-30సంవత్సరాల వయసు వారు చిన్న చిన్న బయోలను చదవడానికే ఇష్టపడతారు. పెద్ద పెద్ద పేరాలను పెడితే స్కిప్ చేస్తారు. ఫన్నీగా ఉంటూనే మీ గురించి విభిన్నంగా తెలియజేసే బయో అయితే అవతలి వారి దృష్టి దానిమీద పడుతుంది.

మీకు 30సంవత్సరాలు దాటినట్లయితే మీ కెరీర్ బాగుండాలి. చాలామంది కెరీర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇద్దరి కెరీర్లు మ్యాచ్ అయ్యాయని అనుకుంటే అట్రాక్ట్ అవుతున్నారు.

ఎలాంటి ఫోటోలు పెట్టాలి?

ఫోటోలు మీ నిజ జీవితంలోని కోణాల్ని కనుగొనే విధంగా ఉండాలి. మీ వాస్తవ జీవితం అవతలి వారికి అర్థమయ్యేలా ఉంటే బాగుంటుంది. ఆటలు ఆడుతున్నప్పుడు, స్నేహితులతో ఉల్లాసంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలను అప్లోడ్ చేయడం మంచిది.

మీ ప్రొఫైల్ విభిన్నంగా ఉండాలంటే

కొన్ని వందల ప్రొఫైల్స్ లో మీది విభిన్నంగా కనిపించాలంటే మీరు రాసిన దానిలో నిజాయితీ ఉండాలి. కాపీ చేసిన బయోలు పెట్టుకోవద్దు. చాలామంది ఇదే తప్పు చేస్తారు. మీరలా చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news