శృంగారం: సెక్సువల్ టెన్షన్ ఆనందాన్ని మరింత పెంచుతుందా? నిపుణులు ఏమంటున్నారు.

శృంగారంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నప్పుడే అందులోని ఆనంద శిఖరాలను అధిరోహించగలరు. కానీ సెక్సువల్ టెన్షన్ కూడా శృంగారంలో పీక్స్ చూపిస్తుందని సెక్స్ థెరపిస్టులు చెబుతున్నారు. ఇంతకీ సెక్సువల్ టెన్షన్ అంటే ఏమిటి? దాని లక్షణాలెలా ఉంటాయనేది ఇక్కడ చూద్దాం.

romance

సెక్సువల్ టెన్షన్

మీ భాగస్వామితో సెక్స్ చేయాలనుకునే ముందు దానికి దారి తీసే పరిస్థితులు దగ్గరవుతుంటే కలిగే టెన్షనే సెక్సువల్ టెన్షన్. దీని లక్షణాలు చాలా ఉన్నాయి.

చూపుతిప్పుకోకుండా భాగస్వామి వంక చూడడం, కళ్ళలో కోరిక కనబడడం.

స్పర్శించడానికి వెతుక్కోవడం, చాలా సార్లు కావాలనే తాకడం.

అనుకోకుండా స్పర్శ తగిలినపుడు అవతలి వారి ముఖ కవలికలను గమనించడం.

భాగస్వామి గురించి రొమాంటిక్ కలలు కనడం.

ఎలాంటి శరీర సంబంధం లేకుండా మీ భాగస్వామితో కాలం గడుపుతున్నట్టు పగటి కలలు కనడం.

భాగస్వామి దృష్టిలో పడాలని చిన్న చిన్న జోకులు వేయడం, మీవైపు తిప్పుకోవాలనే ప్రయత్నాన్ని మరింత పెంచడం.

ఇద్దరే ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బందిగా ఫీలవడం.

అవతలి వారి చర్మాన్ని అలా అలా తాకడం. అప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరగడం.

ఫిజికల్ గా కలుసుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించడం మొదలగునవన్నీ సెక్సువల్ టెన్షన్ లక్షణాలే.

ఇది మంచిదేనా?

సెక్సువల్ టెన్షన్ గురించి పెద్దగా బాధపడాల్సింది లేదు. దీనివల్ల అవతలి వారిలో మీపై ఒక ప్రత్యేకమైన భావాన్ని క్రియేట్ చేయవచ్చు. దానివల్ల మానసికంగానూ, భౌతికంగానూ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇంకా శృంగారంలోని ఆనందాన్ని పీక్స్ లో అనుభవించడానికి ఇది ఉపయోగపడుతుంది. ముందు మొహమాటంతో మొదలై, ముఖాలు చూసుకోవడానికి సిగ్గుపడి, ఆ తర్వాత వారిద్దరిలోని ఉష్ణోగ్రతకి సిగ్గులు విడివడి, హగ్గులు కుదిరి, ఆపై శరీరాలు ఏకమై ఆనంద శిఖరాల మీద ఊయల ఊగాలి.