ఎప్పుడూ ఒక్క అడుగులో ఓడిపోతున్నారా..? ఇలా చేస్తే గెలుపు మీదే..!

-

లైఫ్ లో ప్రతి ఒక్కరికి కూడా గెలవాలని ఉంటుంది. గెలవాలని చాలామంది ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆ కష్టాలను దాటడం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే గెలుపు విషయంలో చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. ఒక్క అడుగు దూరంలో గెలుపుని మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా ఎప్పుడు ఒక్క అడుగు దూరంలో గెలుపుని మిస్ అవుతున్నారా..? అయితే కచ్చితంగా వీటిని మీరు ఫాలో అవ్వాలి. ఇలా చేశారంటే నెక్స్ట్ టైం గెలుపు మీదే. ఒకరోజు కష్టం ఉంటే ఒక రోజు ఆనందం ఉంటుంది. రెండు ఉంటేనే జీవితం. అయితే అతి భావోద్వేగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కోపం, బాధ, సంతోషం, ఏడుపు ఇలా ఏది వచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేసుకోకపోతే ముందుకు వెళ్లలేరు.

ఎప్పుడూ కూడా మీకు కృతజ్ఞత భావం ఉండాలి మీకు సహాయం చేసిన వాళ్ళని మీరు పదేపదే గుర్తు తెచ్చుకోవాలి. మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే స్వీయ క్రమశిక్షణ చాలా ముఖ్యం ఇది మీకు ముందుకు వెళ్లడానికి చాలా ముఖ్యమని గుర్తు పెట్టుకోండి. స్వీయ క్రమశిక్షణ ఉంటే ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే క్షమాగుణం కూడా ఉండాలి. ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు.

ఓటమి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఓటమి నుంచి నేర్చుకున్నప్పుడే మీరు ముందుకు వెళ్తారు లేదంటే మీ జీవితం అంతే. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. తెలియని విషయాలు నేర్చుకోవడం వలన లైఫ్ లో ముందుకు వెళ్లారు. అలాగే ఓసారి తప్పు చేసిన తర్వాత మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం వలన మీరు మీ జీవితంలో ఏదీ నేర్చుకోలేరు ఒకసారి తప్పు చేసిన తర్వాత అది తప్పు అని తెలుసుకుని దానిని మళ్లీ మళ్లీ చేయకుండా చూసుకుంటేనే మీరు నేర్చుకోవడానికి అవుతుంది. లేదంటే ఓటమి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది గెలుపు దారిలోకి మీరు వెళ్లలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version