అనారోగ్యం నుంచి కోలుకున్నాక మీరు టూత్‌ బ్రష్‌ను మార్చుతున్నారా..?

-

మనం ఉపయోగించే పేస్ట్‌ సోప్‌ అయితే అవి అయిపోయినప్పుడు కొత్తది తీస్తాం.. బ్రష్‌ కూడా అంతే.. బాగా పాడేందంటే అప్పుడు కొత్తదీ వాడతాం.. కానీ మీకు తెలుసా.. మీరు ఏదైనా అనారోగ్యం బారిన పడి కోలుకున్నాక.. బ్రష్‌ను కూడా మార్చాల్సి ఉంటుందట.. ఒక్క బ్రష్‌ను కాదు.. అప్పటివరకూ వాడిన టవల్‌, బెడ్‌షీట్‌ ఇవన్నీ మార్చుకోవాలి.. కానీ చాలమంది.. బెడ్‌షీట్‌, టవల్స్‌ అయితే ఉతుక్కుంటారు కానీ.. బ్రష్‌ విషయం వచ్చేసరికి ఎవరికి అసలు ఇది మార్చాలి అని థాట్‌ కూడా రాదు..

మీరు ఏదైనా రోగం నుంచి కోలుకున్న తర్వాత.. మొదట మీ బెడ్‌క్లాత్‌లను మార్చుకుంటారు. టూత్‌బ్రష్‌ను కూడా మార్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మీరు కోలుకున్న తర్వాత మంచం, దిండు, ఇతర వస్తువులను శుభ్రం చేయాలి. ఇన్ఫెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పని చేయాలి. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత, మీకు మళ్లీ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడానికి టూత్ బ్రష్‌ను కూడా మార్చుకోవాలి. అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి.. ప్రజలు వైరల్ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, ఇతర బ్యాక్టీరియా ద్వారా కూడా ప్రభావితమవుతున్నారు. అనారోగ్యం సమయంలో పళ్లు తోముకోవడం వల్ల వారి నోటిలోని ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా టూత్ బ్రష్‌కు అంటుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. రోగి కోలుకున్న తర్వాత కూడా అదే బ్రష్‌ను వాడితే.. ఆ బ్రష్‌పైన ఉన్న ఇన్‌ఫెక్షన్‌, బాక్టీరియా మళ్లీ మీ శరీరంలోకి వెళ్తుంది.

వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత టూత్ బ్రష్ మార్చండి. ఫంగల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్ మార్చడం చాలా ముఖ్యం. అంటే, ఇంట్లో ఎవరైనా వైరల్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్, ఏదైనా ఇతర అంటువ్యాధికి గురైన తర్వాత కోలుకుంటే.. వారు తమ టూత్ బ్రష్‌ను మార్చుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వాష్ రూమ్‌ను కూడా నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని ఇతర సభ్యులకు సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

అంతేకాదు.. సాధారణంగా ఇంట్లో అందరు బ్రష్‌లను ఒకే దగ్గర పెడతారు. అనారోగ్యం భారినపడ్డప్పుడు మీ బ్రష్‌ను సపరేట్‌గానే పెట్టుకోవాలి. బ్రష్ చేసిన అనంతరం టూత్ బ్రష్‌ను నీటితో కడిగినప్పటికీ మన కంటికి కనిపించని సూక్ష్మజీవులతో బ్రష్‌కు అంటుకున్న మురికి అలాగే ఉంటుందని పలు అధ్యయనాల్లో నిరూపితమైంది. అదే బ్రష్‌ను మళ్లీ ఉపయోగిస్తే రోగాల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ టూత్ బ్రష్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. టూత్ బ్రష్ హ్యాండిల్స్, బ్రిసిల్స్‌పై వేలాది రకాల సూక్ష్మజీవులు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వీటితో మరీ అంత ప్రమాదం లేకపోయినా కొన్ని సూక్ష్మ క్రిములు ఫ్లూ, వాంతులు, విరేచనాలు ఇతర ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తాయి. అదే విధంగా ఒకే బ్రష్‌ను రెండు నెలలకు మించి వాడకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news