ఆ అబ్బాయిల గురించి ఓ అమ్మాయి ఏమందో తెలుసా?

-

ఒకప్పుడు అమ్మాయిలకు పెద్దల చూసిన సంబంధం మీద నమ్మకం ఉండేది.. ఆ తర్వాత పెళ్ళి చూపులు జరగడం డైరెక్ట్ గా నచ్చలేదని చెప్పేవారు..రాను రాను వివాహా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.. అమ్మాయిలు వాళ్ళకు నచ్చిన అబ్బాయిలను సెలెక్ట్ చేసుకోవడం చేస్తున్నారు..ఇప్పుడు ఓ అమ్మాయి తనకు కావలసిన అబ్బాయి ఎలా ఉండాలో అని ప్రకటన చేసింది..అది కాస్త వైరల్ గా మారింది..ఆమె చెప్పింది నిజమే అంటూ చాలామంది అమ్మాయిలు మద్దతు కూడా తెలిపారు.

ఇది చూసిన వారంతా అమ్మాయిల కోరికలు ఎప్పుడూ ఎలా ఉంటాయో తెలియదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఓ మ్యాట్రీమోనల్ సైట్‌ లో తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వరుడు గురించి రాసుకొచ్చింది. కానీ చిన్న కండీషన్ పెట్టింది. సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్స్‌ మాత్రం ట్రై చేయొద్దని మెన్షన్ చేసింది. అంతే అది కాస్తా వైరల్ అయిపోయింది.

సాఫ్ట్‌వేర్‌ జాబ్. బీటెక్ కంప్లీట్ చేయగానే ఏదో కోర్స్ నేర్చుకుని ఓ కన్సల్టెన్సీ ద్వారా జాబ్ కొట్టేయడం ఆ తర్వాత MNC లో ప్లేస్‌ సాధించడం ఓ కల. అలా అంచెలంచెలుగా ఎదగడం ఐదంకెల జీతాన్ని అందుకోవడం సాఫ్ట్‌వేర్ జాబ్ అంటేనే ఓ క్రేజ్ అంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం సాఫ్‌వేర్ జాబ్‌లపై చెప్పుకోదగ్గ సానుకూల అంశాలేం కనిపించడం లేదు. రీసెంట్‌గా ఓ అమ్మాయి ఓ మ్యాట్రీమోనల్‌ నుంచి వరుడు కోసం ఇచ్చిన ప్రకటనలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ వద్దని ఖచ్చితంగా తేల్చి చెప్పింది.

వర్క్‌ టెన్షన్స్‌, డెడ్‌లైన్‌, టార్గెట్స్‌ ఇలా రకరకాల ఒత్తిడుల మధ్య పనిచేయడం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్‌కు సాధారణమే. ఆఫీస్‌లో ఉన్నంత వరకు ఈ ఒత్తిడి భరించాల్సిందే. ఇక వీకెండ్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే సెలవులు. దీంతో ఫ్యామిలీకి సరైన సమయాన్ని కేటాయించ లేకపోతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా కరోనా తర్వాత దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేసింది. దీంతో టెక్కీలంతా ఇంట్లోనే కూర్చొని పనిచేస్తున్నారు. అప్పటి నుంచి వారి మానసిక స్థితిలో చాలా మార్పులు వచ్చాయి. వారి టాలెంట్ అంతా ఇంట్లో వారిపై చూపిస్తున్నారనే ఆరోపణలు చాలా వచ్చాయి. వర్క్ ఫ్రస్టేషన్ అంతా వైఫ్‌ పై చూపిస్తున్నారనే కామన్ పాయింట్ ఆ మధ్య బాగానే సర్క్యూలేట్ అయ్యింది.

డబ్బులు పోసి సాఫ్ట్‌వేర్‌ను చేసుకున్నా జాబ్‌ గ్యారెంటీ లేదు. ఇలా రకరకాల పాయింట్లు పట్టుకున్న అమ్మాయిలు అసలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ అంటేనే దూరంగా వెళ్తున్నట్లు ఈ ప్రకటన చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ ప్రకటనపై చాలామంది టెక్కీస్‌ సోషల్ మీడియాలో తమ రియాక్షన్‌ను పంచుకుంటున్నారు. దేశంలో ఎక్కువ మంది సాఫ్‌వేర్ ఇంజనీర్సే ఉన్నారని చెబుతున్నారు…మొత్తానికి ఇది చర్చనీయాంశంగా మారింది.దీనిపై ఒక్కోక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news