నయా ట్రెండ్‌ అవుతున్న గ్రీన్‌ రూఫ్‌.. అందంతో పాటు.. ఎన్నో లాభాలు..!

-

ఈ మధ్య నగరాల్లో ఇంటిరీయర్‌ డెకరేషన్‌ మీద జనాలకు శ్రద్ధ పెరిగింది. ఇళ్లంతా పచ్చదనంతో నింపాలని చూస్తున్నారు. అయితే ఇంట్లో గ్రీనరీ కంటే.. భవంతులపైన గ్రీన్‌ రూఫ్‌ ఏర్పాటు చేయడం వల్ల.. ఇళ్లు అందంగా కనిపిస్తుంది.. చల్లగా కూడా ఉంటుంది. దీని ద్వారా కూలర్లు, ఏసీ వాడకం కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. లివింగ్ రూఫ్‌ పేరుతో వస్తున్న ఈ కొత్త కాన్సపట్‌ ఇప్పుడు నయా ట్రెండ్‌ అయింది. ఈరోజు మనం ఏంటి ఈ గ్రీన్‌ రూఫ్‌, దీని వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి చూద్దామా..!

ఇంతకీ ఏమిటి ఈ గ్రీన్ రూఫ్ అనుకుంటున్నారా?

ఇంట్లో మొక్కలు పెంచుకున్నట్లే ఇంటి పైకప్పున వాటంతటవే పెరిగే నాచు, గడ్డి, సెడమ్ లేదా చిన్న పువ్వులు పూచేటు మొక్కలను ఏర్పాటు చేయడం. ఇలాంటి మొక్కలతో భవనం పైభాగం పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కప్పేయటం. ఇలా ఏర్పాటు చేస్తే భవనం మొక్కలతో ఆకుపచ్చగా కనిపిస్తుంది. చూడటానికి అందంగా ఉంటుంది. దీనినే గ్రీన్ రూఫ్ అంటారు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా పట్టణాల్లో గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే అక్కడి ప్రభుత్వాలు గ్రీన్ రూఫ్‌ల ఏర్పాట్లను తప్పనిసరి చేశాయట. గ్రీన్ రూఫ్‌ ఏర్పాటు హామీలపైనే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌లు, వర్క్‌స్పేస్, రిటైల్ స్పేస్ ఇలా జనావాసాలు, వాణిజ్యపరమైన భవనాలు అన్నీ గ్రీన్ రూఫ్‌లతో పచ్చదనం సంతరించుకుంటున్నాయి.

గ్రీన్ రూఫ్ ఉండటం వలన కలిగే ఉపయోగాలు..

వాయు కాలుష్యం, ఇతర కార్బన ఉద్గారాలను తగ్గిస్తాయి.
హానికరమైన కాలుష్య కారకాలను గ్రహించి గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి.
గ్రీన్ రూఫ్‌లు భవనానికి అలంకరణగా మారతాయి.
ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రీన్ రూఫ్ భవనాన్నిఇన్సులేట్ చేస్తుంది. కాబట్టి వాతావరణంలో మార్పులకు అనుగుణంగా వేడిని నియంత్రిస్తుంది. సహజమైన శీతలీకరణిగా పనిచేస్తూ వేసవిలో చల్లగా ఉంటుంది.
చలికాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది. ఈ రకంగా ఆకుపచ్చ పైకప్పులు ప్రజల జీవన వ్యయాన్ని తగ్గిస్తుంది.
ఏసీలు, కూలర్లు, హ్యుమిడిఫైయర్ల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తుందట. కాబట్టి పవర్ సేవ్ అవుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది.
పక్షులకు ఆవాసంగా ఉంటాయి. జీవవైవిధ్యాన్ని కాపాడుతాయి. పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవడం వలన పైకప్పు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది.

ఇది ఏర్పాటు చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు.. వీలుంటే మీరు ఓ సారి ట్రై చేయండి. అయితే..దోమలు, ఇతర పురుగులు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.!

Read more RELATED
Recommended to you

Latest news