వీడు అస్సలు మనిషేనా.. అతి కిరాతకంగా నెమలిని హింసిస్తున్న వ్యక్తి.. చివరికి..

-

నెమలిని చూడటానికి అందరు ఇష్టపడతారు.. అది నాట్యం చేస్తుంటే చూస్తూ మైమరచిపోతారు.. అలాంటి ఓ పక్షిని హింసిస్తు టార్చర్ చేశాడో వ్యక్తి..ఒంటినిండా అందమైన ఈకలతో అందరినీ ఆకట్టుకునే ఆ మూగజీవికి నరకం చూపించడో వ్యక్తి. చివరికి ఆ ప్రాణి అతని పైశాచిక చర్యకు బలైపోయింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.. ఆ ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది..

మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఓ వ్యక్తి నెమలి ఈకలను తీయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన యొక్క వీడియో, వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నాడు, చాలా మంది వినియోగదారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో వైరల్‌గా మారింది..నిందితులను గుర్తించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు..

వైరల్ వీడియోలో కనిపించిన బైక్ నంబర్ ఆధారంగా యువకులను గుర్తించారు. ఇది జిల్లాలోని రీతీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) గౌరవ్ శర్మ చెప్పారు. నిందితుడు అతుల్ నెమలి ఈకలను బయటకు తీస్తున్నట్లు వీడియోలో ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతున్న పాటతో పాటు వీడియోను పోస్ట్ చేశారు.. అయితే, అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా యువకుడు లేడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ తెలియగానే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించినట్టు తెలిపారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు..ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version