అబ్బాయిలు మీరు కూడా కాలికి నల్లదారం కట్టుకుంటున్నారా..? అయితే..

-

ఈరోజుల్లో కాలికి నళ్ల తాడుని కట్టుకోవడం ఫ్యాషన్‌ అయిపోయింది. కట్టుకునే వారందరికి అసలు దీని వల్ల ఏంటి లాభం అనేది కూడా తెలియదు.. దిష్టి తగలకుండా అని మాత్రమే అనుకుంటారు.. చేసేపని పూర్తిగా తెలియకపోతే.. దాని వల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ.. అర్థంకాలేదా.. బాగుంటదని కాలికి నల్ల తాడును ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకుంటే..దానివల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి.. కాలికి నల్లతాడును పరుషులు, స్త్రీలు ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి.. దీనివల్ల ఏం ఏం ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పాదాలకు దగ్గర నల్ల దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తన పాదాల దగ్గర నల్ల దారం ధరించిన వ్యక్తి చెడు కన్ను నుండి రక్షించబడతాడట.. పాదాల దగ్గర నల్ల దారం ధరించడం వల్ల ఆర్థిక స్థితి బలంగా ఉంటుందట..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పాదాల దగ్గర నల్ల దారం ధరించిన వారికి శని గ్రహం యొక్క ప్రభావం తక్కువగా ఉంటుందట..
జాతకంలో బలహీనమైన రాహు మరియు కేతువులు ఉన్నవారు వారి పాదాల దగ్గర నల్ల దారం కట్టడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు.

స్త్రీలు ఏ కాలికి నల్ల దారం కట్టాలి..?

స్త్రీలు ఎప్పుడూ ఎడమ కాలికి మాత్రమే నల్ల దారం కట్టాలి. అదికూడా శనివారం మాత్రమే నల్ల దారం ధరించాలి. మీకు ఎప్పుడు మూడ్‌ వస్తే అప్పుడు కట్టుకోవడం మంచిది కాదట..

పురుషులు ఏ కాలికి నల్ల దారం కట్టుకోవాలి..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలులో నల్లటి దారం కట్టుకోవాలని సలహా ఇస్తారు. పురుషులు మంగళవారం మాత్రమే నల్ల దారం ధరించాలి..ఇది శని గ్రహానికి బలాన్ని ఇస్తుంది. అయితే చాలామంది అమ్మాయిలకు ఎడమకాలికి కట్టుకున్నారు కదా అని అబ్బాయిలు కూడా ఎడమకాలికే కట్టుకుంటున్నారు.. శాస్త్రం ప్రకారం..అబ్బాయిలూ మీరు కుడికాలికే నల్లదారం కట్టుకోండి మరీ..!

ఇవన్నీ ఎవరు నమ్ముతారులే అనుకునే వారు లైట్‌ తీసుకోవచ్చు..కానీ ఇప్పటికే మీరు నల్లదారం కట్టుకునే అలవాటు ఉంటే.. మరీ తప్పు ఏమైనా చేస్తుంటే సరిచేసుకోవడంలో తప్పుఏం లేదు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news