ఈ గ్రామంలో మనుషులు కాదు.. దెయ్యాలు, ఆత్మలే ఉంటాయట

-

దెయ్యాలు అంటే నమ్మకం లేని వాళ్లకు ఈ గ్రామం ఒక సవాల్‌ లాంటిది. మిస్టరీగా మిగిలిన మనుషులు, సమాధానం దొరకని ప్రశ్నలు ఈ గ్రామానికే సొంతం. అదే రాజస్థాన్ రాష్ట్రంలోని కుల్ధర గ్రామం. జైసల్మేర్‌కు పశ్చిమాన 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 300 సంవత్సరాల కంటే పురాతనమైన ఈ గ్రామం ఒకప్పుడు పాలివాల్ బ్రాహ్మణులచే స్థాపించబడిన సంతోషకరమైన మరియు సంపన్న గ్రామం.
ఒక ప్రాచీన కధనం ప్రకారం… జైసల్మేర్ లో సలీం సింగ్ అనే ఓ దుష్ట దివాన్ కుల్ధర గ్రామ అధిపతి (ముఖియా) కుమార్తెపై చెడు దృష్టిని కలిగి ఉంటాడు.
ఆ దివాన్ ఆమెను వివాహం చేసుకునేందుకు తనకు అప్పగించాలని, లేకపోతే పర్యవసానాలను గ్రామస్తులందరూ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తాడు. ఆ తరువాత సుమారు 85 గ్రామాల అధిపతులందరూ ఆ రాత్రి గుమిగూడి వారి గౌరవాన్ని కాపాడటానికి గ్రామాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. వారు బయలు దేరే ముందు ఆ స్థలంలో తరువాత ఎవరూ నివసించలేరని శపిస్తారు. ఇప్పటి వరకూ కుల్ధర గ్రామం మనుషులు లేని ఎడారిగా ఉంది. ఇక్కడికి సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ప్రకారం కుల్ధర ఇప్పుడు దెయ్యాలు, ఆత్మలచే వెంటాడబడుతుందని నమ్ముతారు.
ఈ గ్రామంలోకి వెళ్లాలనుకుంటే ప్రభుత్వం కొంత ప్రవేశ రుసుమును కూడా విధించింది. మీరు కాలినడక ద్వారా సందర్శించాలనుకుంటే రూ.10లు, లేదా మీ వాహనాన్ని లోపలికి తీసుకువెళ్లాలని అనుకుంటే రూ.50లు చెల్లించాలి. గ్రామ ద్వారాలకు ఒక వృద్ధుడు కాపలకాస్తాడు. ఆయన తన కొడుకుతో కలిసి ఈ గ్రామం చుట్టుపక్కల 40 సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. ఈ గ్రామం దెయ్యాలచే వెంటాడబడుతుందనే వార్తను ఈయన పూర్తిగా ఖండిస్తాడు. ఇది పర్యాటకులను ఆకర్షించడానికి పుట్టించిన ఒక పుకారు మాత్రమే అంటూ కొట్టి పారేస్తాడు. అయితే ఈ గ్రామానికి కొంత అతీంద్రియ అనుభూతిని అందించే గుణం ఉందని, అది ఆ దేవుడికే తెలియాలి అని అంటాడు.
కుల్దరలో చాలా సంవత్సరాల క్రితం ప్రజలు నివసించేవారన్న విషయం మీకు తెలిసిందే. దీనికి చిహ్నంగా అనేక శిధిలమైన పురాతన భవనాలు, గృహాలు సందర్శకులకు ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఈ ప్రాంతానికి రోజు రోజుకూ పెరుగుతున్న పర్యాటక ఆదరణ దృష్ట్యా రాజస్థాన్ ప్రభుత్వం ఇక్కడ కొన్ని పాత ఇళ్లను పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version