ఓరి నాయనో.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు.. వీడియో చూస్తే నవ్వాగదు..

-

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.. అందులోను కొన్ని పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి.. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో వివాహ వేడుక జరుగుతుండగా భారీ వర్షం కురిసింది. దీంతో పెళ్లి సందడి కాస్త గందరగోళంగా మారింది. కానీ, పెళ్లికి వచ్చిన అతిధులు మాత్రం వర్షంతో పోరాడిన తీరు చూసి జనాలు వీళ్లకు ఫ్యాన్ అయిపోయారు ఇంతకీ పెళ్లిలో వర్షం పడుతుండగా, ఆ అతిథులు చేసిన హంగామా చూస్తే పొట్ట చెక్కలు అవ్వడం మాత్రమే కాదు మీరు కూడా.. కాస్త కష్టంగా ఉన్నా కూడా ఫన్నీగా ఉంటుంది..

ఇలాంటి దేశీ జుగాడ్ మన దేశంలోని ప్రతి మూలలో ఎంత వైరల్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వీడియోలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది.. అయితే, ముహూర్తం టైమ్ కు భారీగా వర్షం కూడా కురుస్తుంది.. ఆ సమయంలోనే భోజనాల కార్యక్రమం జరుగుతున్న తీరును ఈ వైరల్ వీడియోలో చూడొచ్చు.. అయితే, ప్రజలు భోజనం కోసం కూర్చునే టైమ్‌లో జోరున వర్షం పడుతోంది. టెట్‌ మీద నుంచి నీళ్లు కిందకు జారిపడుతున్నాయి. దాంతో కొందరు చెల్లా చెదురుగా పారిపోయారు. కానీ, చాలా మంది మాత్రం ఆ పక్కనే ఉన్న మంచాలు, బెడ్లను ఎత్తుకుని తలలపై పెట్టుకున్నారు.

వరుసగా కూర్చున్న జనాలు తలపై బెడ్‌ పెట్టుకుని తినటం మొదలు పెట్టారు. ఈ ఫన్నీ సీన్‌ మొత్తాన్ని రికార్డ్‌ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ట్రెండ్ అవుతుంది.. ఏం జరిగిన తిండి తినటం మాత్రం వదిలిపెట్టేది లేదంటున్నారు. ఇంకొకరు సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుందని రాశారు. వీళ్లంతా గొప్ప ఆలోచన చేశారు.. లేదంటే, పెళ్లి కోసం చేసిన చాలా ఆహారం వృధా అయ్యేదని మరికొంతమంది చెబుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

https://www.instagram.com/reel/Crs5IgppA6L/?igshid=MzRlODBiNWFlZA==

Read more RELATED
Recommended to you

Latest news