మీ సమస్యలను పక్కనపెట్టేసి ఆనందంగా వుండండి..!

-

పదే పదే మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు బాధ పడుతూ ఉంటాయి. వీటి వల్ల మనం ఎంతో కుంగిపోతూ ఉంటాము. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సాధారణంగా జరిగేదే. కొన్ని పనుల వల్ల కానీ కొన్ని సమస్యల వల్ల కానీ చింతిస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి అయితే ఏళ్ల తరబడి ఆ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. దానితో జీవితంలో ఆనందం లేక ప్రతి రోజు బాధగా ఉంటారు పైగా ప్రతి రోజు బాధ తప్ప ఎలాంటి ఆనందం వారికి కలగదు.

మీకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మీరు కూడా ప్రతిరోజు పొంగిపోతూ ఉంటారా..? అయితే తప్పకుండా దీనిని ఫాలో అవ్వాల్సిందే. నిజానికి పలు సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. పదే పదే సమస్యలను తలచుకుని బాధపడుతూ ఉంటే జీవితమంతా కూడా అలానే ఉంటుంది.

ఒక్కొక్కసారి మనకి కష్టంగా ఉంటే పక్కన పెట్టేసి మనల్ని అందంగా ఉంచుకునేందుకు మార్గాన్ని వెతుక్కోవాలి. అలా మనం డైవర్ట్ అయితే కచ్చితంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది. అలా అని పూర్తిగా సమస్యను మర్చిపోమని చెప్పడం లేదు ఎందుకంటే అది అంత సులభం కాదు. అప్పుడప్పుడు ఆనందంగా ఉండడం కోసం ఆ బాధల్ని మర్చిపోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు మార్గం వెతుక్కొని ఉంటే అప్పుడు కచ్చితంగా మీరు ఆనందంగా జీవించగలుగుతారు.

ప్రతి ఒక్కరి జీవితంలో సుఖం దుఃఖం రెండు ఉంటాయి రెండూ కలిస్తేనే జీవితం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటే ఆనందంగా జీవించడానికి అవుతుంది లేదంటే పదేపదే బాధలే వెంటాడుతూ ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే ఈరోజు నేను దాని గురించి ఆలోచించనని మీకు మీరే చెప్పుకోండి అలా మీరు దానిని పక్కన పెట్టి మిగిలిన వాటి గురించి ఆలోచించండి దీనివల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలానే పనుల మీద మీరు ఏకాగ్రతని పెట్టుకుంటారు అన్నిటికంటే ముఖ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news