ఒంటరితనం ఒంటికి మంచిది కాదట… తాజా అధ్యయనంలో తెలిన షాకింగ్‌ నిజం..

-

పైకి నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వ్యక్తి వెనుక కూడా ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. ఏదో సమస్యతో సతమతమవుతూ ఉంటారు. భవిష్యత్తు ఎప్పడూ ప్రశ్నార్థకంగానే అనిపిస్తుంది. తలుచుకుంటే కన్నీళ్లు ఆగని చేదు ఘటనలు ఎన్నో.. జీవిత పాఠాలు నేర్పినవారు కొందరైతే.. అనుభవాలు అందించిన వారు మరికొందరు. ఒక స్టేజ్‌లో ఈ సొసైటి అంటేనే చిరాకు వస్తుంది. మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలు అనే మాట చెవికి బాగా వినిపిస్తుంది.. ఏ సంబంధంతో సంబంధం లేకుండా దూరంగా వెళ్లిపోయి నీతో నువ్వు బతుకొచ్చుగా అని మనసు పదే పదే చెప్తుంది.. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా..? కొందరు ఆలోచనకే పరిమితం అయితే.. ఇంకొందరు అనుకున్నట్లే చేస్తారు. సమాజానికి దూరంగా బతికేస్తారు. ఇలా చేయడం వల్ల ఆయుష్షు తగ్గుతుందంటున్నాయి తాజా అధ్యయనాలు..

ఒంటరితనం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమట. ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన సమస్యలను దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. నలుగురితో కలిసి ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్లు, భావోధ్వేగాలు ఉల్లాసంగా, ఆనందంగా ఉండేలా ప్రేరేపిస్తాయి. ఒంటరిగా ఉంటే మెదడు చురుగ్గా పనిచేయకపోగా, శరీరానికి అవసరమైన హార్మోన్లు కూడా విడుదలకావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చుట్టూ మనుషులు ఉండాలని కోరుకోవడం మానవ సహజ లక్షణం.

ఇలా ఒంటరితినం ఎక్కువైతే.. అకాల మరణానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. 65 ఏళ్ల లోపు వయసున్న వారిలో నాలుగింట ఒక వంతు మంది ఒంటరి తనంతో బాధపడుతున్నారని, 40 ఏళ్లు పైబడిన వారిపై నిర్వహించిన పరిశోధన ప్రకారం సోషల్‌ ఐసోలేషన్‌ అకాల మరణానికి దారి తీస్తుందని వెల్లడించింది.

మారుతున్న జీవనశైలి, కుటుంబ వ్యవస్థ, జీతం కోసమని ఉన్నఊరికి దూరంగా వెళ్లటం ఇలాంటి కారణాలు వల్ల ఇంట్లో వాళ్లు ఒంటరితనంతో సహజీవనం చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను ఎవరితోనైనా పంచుకోవాలని భావిస్తారు. ఐతే తమ భావాలను పంచుకోవడానికి ఎవరూ లేకపోతే అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిరాశ, ఒత్తిడి పెరిగి ఇతర మానసిక రుగ్మతలకు లోన్లీనెస్‌ మూలకారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

-Triveni Buskarowthu
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news