మీ బుజ్జాయిల పాలకోసం మిల్క్ వార్మర్‌..ఇక ఆ బాధ అక్కర్లా..! 

-

పసిపిల్లలు నోరు తెరిచి ఏది అడగలేరు. వాళ్లు ఆకలేసినా, పిచ్చిలేసినా ఏడుస్తారు. ఆ ఏడుపును బట్టే తల్లి పరిస్థితి అర్థంచేసుకోవాలి. ఒక్కోసారి అసలు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియదు. జనరల్‌గా చిన్నపిల్లలు ఏడిస్తే..వెంటనే వాళ్లకు పాలిస్తారు. అయితే ఏ టైంలో అయినా. పాలు కాచీ, అవి చల్లార్చే వరకు ఆగి..పాలు పట్టాలి అంటే.. చాలా టైమ్‌, శ్రమతో కూడుకున్న పనే.! అసలే ఓ పక్క గుక్కపట్టి పిల్లలు ఏడుస్తుంటే.. మనం ఇవన్నీ చేయడం అంటే మనకు ఇబ్బంది, ఇంట్లో నిద్రపోయే వాళ్లకు ఇబ్బందే.. ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారం కనిపెట్టేయొచ్చు. వంటగదిలో బోలెడు పరికాలు వచ్చాయి. దేనికి శ్రమపడకుండా ఈజీగా పని అయిపోయింది. మరి ఈ పనికూడా ఓ పరికరం మార్కెట్‌లోకి వచ్చింది..అదే మిల్క్‌ వార్మర్.
ఇందులో రెండు పాల బాటిల్స్‌ను కూల్‌గా ఉంచి, పాలు విరిగిపోకుండా స్టోర్‌ చేయడంతో పాటు ఐదే ఐదు నిమిషాల్లో గోరువెచ్చటి పాలను అందిస్తుంది. ఈ డివైజ్‌ను బెడ్‌ రూమ్‌లోనే పవర్‌ సాకెట్‌ దగ్గర అమర్చుకుని.. స్విచ్‌ ఆన్‌ చేసుకుని పెట్టుకుంటే చాలు. డివైజ్‌కు వెనుకవైపు భాగం ప్రత్యేకమైన మూత ఉంటుంది. దానిలో రెండు పాల బాటిళ్లను ఉంచితే ఏ కాలంలోనైనా చల్లగా నిలువ ఉంటాయి.
బిడ్డ ఏడవడం మొదలుపెట్టిన వెంటనే.. అందులోని ఒక పాల బాటిల్‌ను ముందువైపు చిత్రంలో ఉన్న విధంగా పెట్టు కోగానే.. 5 నిమిషాల్లో పాలు వేడెక్కుతాయి. భలే ఉంది కదూ? ఈ డివైజ్‌ బెడ్‌ రూమ్‌లో ఉంటే.. ఎప్పుడుపడితే అప్పుడు కిచెన్‌లోకి వెళ్లాల్సిన పని ఉండదు.. పిల్లలు పాలకోసం ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరమూ ఉండదు. దీని ధర 107 డాలర్లు (రూ.8,249). పాలు విరిగిపోతాయోమో అని డౌట్‌ మీకు రావొచ్చు. డివైజ్‌లో కూలింగ్‌ ఆప్షన్‌ ఉంది కాబట్టి పాలకు ఏం కాదు. ఆన్‌లైన్‌లో వివిధ రకాల మిల్క్‌ వార్మర్‌లు అందుబాటులో ఉన్నాయి. మూడు వేల నుంచి కూడా ఇవి లభిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news