తెలంగాణాలో వెమ్‌ టెక్నాలజీస్‌ రావడం సంతోషం : కేటీఆర్‌

-

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వెమ్‌ టెక్నాలజీస్‌ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్‌.

Stop groupism, KTR tells TRS leaders

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి.. ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పారు. దేశ రక్షణ రంగంలో హైదరాబాద్‌లోని రక్షణ పరిశ్రమలది కీలకపాత్ర అని చెప్పారు మంత్రి కేటీఆర్‌. వెమ్‌ టెక్నాలజీలో సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news