యూకేలో మంకీపాక్స్ వైర‌స్ కేసులు..!

-

ప్ర‌స్తుతం క‌రోనాతో ప్ర‌పంచం అత‌లాకుత‌లం అవుతుంటే.. ఇంకోవైపు రోజుకో వైర‌స్ పుట్టుకొస్తోంది. తాజాగా యూకే లోని నార్త్ వేల్స్‌లో మంకీపాక్స్ వైర‌స్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇది జూనోటిక్ అనే వ‌ర్గానికి చెందింది. పార్లమెంటులో ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ గురువారం ఈ మంకీపాక్స్ వైర‌స్ వ్యాప్తి చెందుతోంద‌నిడాన్ని స్ప‌ష్టం చేశారు.

కాగా పీహెచ్‌డబ్ల్యు ఆరోగ్య పరిరక్షణలో రిచర్డ్ ఫిర్త్ కన్సల్టెంట్ మాట్లాడుతూ ఈ వైర‌స్‌కు సంబంధించిన రోగులు త‌మ పర్యవేక్షణలోఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే వారిని క‌లిసిన వారిని ఛేజ్ చేస్తున్న‌ట్టు వివ‌రించారు. అయితే సాధారణంగా ఈ వైర‌స్ ప్రజలకు వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే ఈ వ్యాధి సోకిన వారితో ట‌చ్‌లో ఉన్న వారిని గుర్తించిన‌ట్టు ఫిర్త్ చెప్పారు. మంకీపాక్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నైజీరియాలో 39 సంవత్సరాల కింద మొదటిసారి ఈ మంకీపాక్స్ అనే వైర‌స్ కేసు న‌మోదైంది. ఇక అప్పటి నుంచి నైజీరియాలో ఈ వైర‌స్ కేసులు చాలా అరుదుగా వ‌స్తున్నాయి. ఇది కూడా జూనోటిక్, మశూచి కుటుంబానికి చెందిన వైర‌స్‌. కాగా ఈ వైర‌స్ మశూచి కంటే తక్కువ తీవ్రత ఉంటుంద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version