వామ్మో.. ఈ చేపను చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

-

సముద్రాలు ఎన్నో జీవరాశులకు నిలయం..రకరకాల జీవులు ఉంటాయి.అందులో కొన్ని చూడటానికి అందంగా ఉంటే, మరి కొన్ని మాత్రం భయంకరంగా ఉంటాయి. అలాంటి భయంకర ప్రాని జనాల ముందుకు వస్తే ఇక అంతే.. అటువంటి వింత, భయంకరమైన ఓ జీవి, ఆగ్నేయ ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. ఈ చేపను ప్రపంచంలోనే అత్యంత వికారమైన జీవిగా పేర్కొంటారు. ఈ జీవి చాలా భయంకరంగా కనిపిస్తుంది. జాసన్ మోయెస్.. ఒక ప్రొఫెషనల్ మత్స్యకారుడు, సిడ్నీకి దక్షిణాన 240 మైళ్ల దూరంలో ఉన్న తన స్వస్థలమైన బెర్మాగుయ్ తీరంలో రహస్య జీవిని పట్టుకున్నాడు.

అతను వెంటనే ఈ వింత జీవిని ఫోటోలు తీసి సోషల్ మీడియలో పంచుకున్నాడు. మత్స్యకారుడు జాసన్ ఇప్పుడు ఈ జీవిని గుర్తించడంలో ప్రజల సహాయం కోరాడు.ఆ విచిత్ర జీవి చిత్రం వైరల్ అయ్యింది.. ఆ చేప మచ్చలతో ఉంది. గులాబీ,గోధుమ రంగులో కనిపిస్తుంది. చేప కళ్ళు దాని తల వైపుల నుండి బయటికి తిరిగి ఉన్నాయి. అదే సమయంలో దాని పెద్ద నోరు మొత్తం ముఖాన్ని కప్పివేసింది. ఇక చేప దంతాలు చాలా పదునుగా ఉన్నాయి. ఈ పెద్ద చేప తన నోటితో మరో చేపను మింగడం కూడా చూడవచ్చు..

4 కిలోల బరువున్న ఈ చేప 540 మీటర్ల లోతులో చిక్కుకుందని మత్స్యకారుడు జాసన్ న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు ఈ చేప చిత్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఈ చేప ఒక బొచ్చు చేప కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి ఇది సోషల్ మీడియలో వైరల్ అవుతుంది..మీరు ఒకసారి చూడండి.. ఎంత భయంకరంగా ఉందో మీరు చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news