ప్రేమను అంగీకరించలేదని రూ. 24 కోట్లు పరువు నష్టం దావా వేసిన యువకుడు

-

ప్రేమించడం కన్నా..ప్రేమించబడటం చాలా గొప్ప విషయం..అయితే ఆ ప్రేమ స్వచ్ఛమైనది అయినప్పుడే అదృష్టవంతులు అవుతాం.. ఈరోజుల్లో ప్యూర్‌ లవ్‌ అనేది అందని వజ్రంలా మారిపోయింది. ప్రేమను ఒప్పుకోకపోతే.. యాసిడ్‌ దాడులు, నరకడాలు, ఇంకా ఎన్నో విధాలుగా హింసించడం చూస్తూనే ఉన్నాం.. ఈ అబ్బాయి మాత్రం ప్రేమను ఒప్పుకోలేదని పరువు నష్టం దావా వేశాడు.. అది కూడా ఏకంగా రూ. 24 కోట్లు.. స్నేహితురాలు ప్రేమించలేదని ఇలా చేశాడట.. ఈ వెరైటీ లవ్‌స్టోరీ ఏంటో మీరు చూడండి..!!
తన ప్రేమ కాదని అన్నందుకు సింగపూర్‌కి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితురాలి మీద కేసు వేశాడు. తను ప్రేమించకపోవడం వల్ల మానసికంగా తీవ్రంగా గాయపడ్డాను, వ్యాపారపరంగా కూడా నష్టపోయానంటూ అతను ఆమె మీద పరువు నష్టం దావా వేశాడు. పరిహారంగా ఏకంగా 3 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.24 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
సింగపూర్‌కి చెందిన కౌషిగన్‌కి 2016లో నోరా టాన్ అనే మహిళ పరిచయం అయ్యింది. 2020 వరకు ఇద్దరూ స్నేహితుల్లాగా మంచిగానే ఉన్నారు. కానీ ఒకరోజు కౌషిగన్ టాన్‌తో రొమాంటిక్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలని అనుకుంటునట్టు చెప్పాడు. కానీ టాన్ మాత్రం అందుకు ససేమీరా అంది.. తన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలేదని, తనని ఆ ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదని కేవలం బెస్ట్ ఫ్రెండ్‌గా మాత్రమే చూస్తున్నా అని చెప్పింది. దీంతో అతనికి కోపం వచ్చి టాన్‌ని బెదిరించడం మొదలు పెట్టాడు. కేసు వేస్తానంటూ వరుసగా బెదిరింపు మెసేజ్‌లు పెట్టేవాడట.. టాన్ తనతో ఒక ఒప్పందానికి వచ్చింది. తమ మధ్య వచ్చిన సమస్య పరిష్కరించుకోవడం కోసం ఇద్దరూ కలిసి కౌన్సిలింగ్‌కి వెళ్లాలని అనుకున్నారు. ఏడాది పాటు కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు. కానీ కౌషిగన్ మాత్రం తన మనసు మార్చుకోలేదు.
ఎన్ని కౌన్సిలింగ్‌లకి వెళ్ళినా కూడా టాన్ మీద తన ఫీలింగ్స్ మారలేదని చెప్పాడు. ఇలా అయితే బంధం కొనసాగించడం అనవసరమని టాన్ తనని దూరం పెట్టింది.. కోపం తెచ్చుకున్న కౌషిగన్ ఆమె మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఫిక్స్‌ అయ్యాడు.. కోర్టులో కేసు వేశాడు. తన ప్రవర్తన వల్ల మానసికంగా కుంగిపోయాను, తను చేసిన గాయం వల్ల బాధ పడుతున్నాను.. తన ఫీలింగ్స్ అంగీకరించకపోవడం వల్ల వ్యాపారపరంగా కూడా దెబ్బతిన్నా, పరువుకి భంగం వాటిల్లింది అంటూ కోర్టులో కేసు వేశాడు.. తనకి జరిగిన నష్టానికి 3 మిలియన్ల డాలర్లు పరిహారం ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేశాడు.
ఈ పిటిషన్ విచారణ ఫిబ్రవరి 9న జరగనుంది. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అమ్మాయి మనోభావాలు గౌరవించాలని కౌషిగన్‌కి కోర్టు మొట్టికాయ వేస్తుందో, లేదంటే టాన్‌ని తిడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వార్త వైరల్‌ అవడంతో.. ఈ కేసుకు కానీ కోర్టులో కౌషిగన్‌కు అనుకూలంగా తీర్పు వస్తే.. ఇక అబ్బాయిలు దాడులు ఆపేసి..కేసులు వేస్తారేమో..! కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news