తల్లికి ఊబకాయం ఉంటే.. ఆ ప్రభావం కూతురుమీద పడుతుందట..!

-

షుగర్‌, బీపీ, అధిక బరువు ఇలాంటివి అంటువ్యాధులు కాదు..మన జీవనశైలి మార్పుల వచ్చే రోగాలు ..ఇలానే మనం ఇన్ని రోజులు అనుకుంటున్నాం.. కానీ.. తల్లి అధిక బరువు ఉంటే.. ఆమెకు పుట్టిన ఆడపిల్లలపై ఆ ప్రభావం ఉంటుందట.. తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. తల్లికి పుట్టిన మగసంతానికి ఆ ముప్పు ఉండదట. ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి.

ఊబకాయం అనేది ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితం కాలేదు.. ఎక్కడ చూసినా అధిక బరువుతో బాధపడేవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో వయోజనుల్లో సగం మంది, పిల్లల్లో 20 శాతం మంది ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అక్కడ ఊబకాయంపై మెడికల్ కేర్‌కు 173 బిలియన్ డాలర్లు ఖర్చవుతోందని అంచనా.

ఊబకాయం లేదా అధిక కొవ్వు గల శరీరం కలిగిన మహిళలకు పుట్టిన ఆడ సంతానానికి ఊబకాయం వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలిందని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ఆంప్టన్ ఎంఆర్సీ లైఫ్‌కోర్స్ ఎపిడెమాలజీకి చెందిన నిపుణులు రెబెకా జే మూన్ వివరించారు.

ఎందుకు ఇలా జరుగుతుంది..?

ఇలా ఎందుకు జరుగుతోందో మరిన్ని అధ్యయనాల వల్ల తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే ఆడ సంతానంలో శరీర బరువు విషయంలో చిన్న వయస్సులోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

అధ్యయనం ఎలా చేశారంటే..

పరిశోధకులు 240 మంది చిన్నారుల 9 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సులో ఉన్న వారిని శరీరంలోని కొవ్వు, కండరాలను పరీక్షించారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ని అధిక బరువు, ఒబెసిటీకి స్క్రీనింగ్ టూల్‌గా వాడొచ్చా లేదా నిర్ధారించేందుకు ఈ డేటాను వారు వినియోగించారు. బాలికలు తమ తల్లిలాగే బీఎంఐ, ఫ్యాట్ మాస్ కలిగి ఉన్నారని అధ్యయనం గుర్తించింది.

అధిక బరువు, ఒబెసిటి లేదా అధిక కొవ్వు కలిగిన మహిళలకు పుట్టిన ఆడ సంతానానికి ఒబెసిటీ, అధిక బరువు కలిగి ఉండే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టంగా తేల్చింది. అయితే తల్లులు ఊబకాయంతో ఉన్నప్పుడు అబ్బాయిల విషయంలో ఈ ముప్పు ఉన్నట్టు తేలలేదు. అలాగే తండ్రులు ఊబకాయంతో ఉన్నప్పుడు కూడా అబ్బాయిలకు ఈ ముప్పు ఉన్నట్టు తేలలేదు. అంటే తల్లి బరువుగా ఉంటే..ఆ ప్రభావం ఆడ సంతానంపై పడుతుంది.. కాబట్టి.. ముందు నుంచే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news