వైఎస్సార్సీపీకి ఓటేశారని గ్రామం నుంచి బహిష్కరించారు..!

-

వాళ్లను గుడిలోకి కూడా రానీయకుండా.. వాళ్లకు హారతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమాలకూ మీరు హాజరు కావద్దంటూ వాళ్లను బెదిరించారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అయితే ముగిశాయి కానీ.. ఎన్నికల హడావుడి మాత్రం ఇంకా తగ్గలేదు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయినప్పటికీ… ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి ఏపీలోని ప్రధాన పార్టీలు గెలుపుఓటములపై అంచనాలు వేసుకుంటూనే ఉన్నాయి. ఎవరు తమకు ఓటేశారు.. ఎవరు వేయలేదు.. ఏ వర్గం తమవైపు ఉంది.. ఏ వర్గం తమకు వ్యతిరేకంగా ఉంది.. ఇలా వాటన్నింటి లెక్కలు వేసుకుంటూ బిజీబిజీగా గడపుతున్నారు.

అయితే.. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు మాత్రం ఇంకో అడుగు ముందుకేసి… వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేసిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో ఈ ఘటన జరుగుతుండటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. చంద్రగిరి మండలంలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచే బహిష్కరించారు. ఆ కుటుంబం వైఎస్సార్సీపీకి ఓటేయడమే వాళ్లు చేసిన తప్పట. అందుకే.. ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. అంతే కాదు.. కుటుంబంలోని మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు.

చివరకు వాళ్లను గుడిలోకి కూడా రానీయకుండా.. వాళ్లకు హారతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమాలకూ మీరు హాజరు కావద్దంటూ వాళ్లను బెదిరించారు. దీనిపై ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన వైఎస్సార్సీపీ నాయకులు.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలా కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version