కంపెనీకి సీఈవోగా రోబో.. దెబ్బకి ఆరు నెలల్లో పెరిగిన షేర్‌ వాల్యూ..!!

-

రోబోలతో హోటల్‌లో సర్వర్‌గా చేయించుకున్న వాళ్లను చూశాం..కానీ ఓ కంపెనీకి రోబోనే సీఈవో అయితే ఎలా ఉంటుంది..కాలం ఎంత మారిపోయింది.. చైనా కంపెనీ రోబోనే సీఈవోగా చేసింది. వాస్తవానికి చైనాకు(China) చెందిన మెటావర్స్ కంపెనీ నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ తన బాస్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మానవరూప రోబోట్‌ను నియమించింది. అంతే కాదు రోబోను సీఈవోగా చేసిన తర్వాత కంపెనీ వ్యాపారం కూడా పెరిగింది.

 

ఆగస్టు 2022లో AI పవర్డ్ వర్చువల్ హ్యూమనాయిడ్ రోబోట్‌ను తన అనుబంధ కంపెనీకి CEOగా చేయాలని కంపెనీ ప్రకటించింది. ఈ రోబో పేరు టాంగ్ యు. గూగుల్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. గత ఆరు నెలల్లో కంపెనీ షేర్లు 10 శాతం పెరిగాయట.. దీంతో ఈ షేర్ల విలువ 1.1 బిలియన్ డాలర్లకు చేరింది.

గత ఏడాది ఆగస్టులో రోబోట్‌ను CEO చేస్తున్నప్పుడు, రోబోట్ ఉద్యోగులందరికీ మెరుగైన మరియు సమర్థవంతమైన కార్యాలయాన్ని అందిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.. నెట్‌డ్రాగన్ ఛైర్మన్ డెజియాన్ లియు మాట్లాడుతూ, AI అనేది కార్పొరేట్ మేనేజ్‌మెంట్ యొక్క భవిష్యత్తు అని తాను నమ్ముతున్నానని చెప్పారు. టాంగ్ యును మా CEOగా నియమించడం మేము పనిచేసే విధానాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ఇటీవల OpenAI దాని చాట్‌బాట్ ChatGPTని పరిచయం చేసింది. ప్రారంభించినప్పటి నుండే ఇది నెటిజన్లును ఆకట్టుకుంది. ఎలాంటి కోడ్‌ను అయినా అవలీలగా రాస్తుంది. భగవద్గీత శ్లోకాలను సైతం అందిస్తుంది. దాదాపు ప్రతిరంగానికి సంబంధించి సొల్యూషన్‌ చాట్‌ జీపీటి దగ్గర ఉంది. ఇలాంటి టెక్నాలజీలు బాగా డవలప్‌ అయితే..భవిష్యత్తులో మనుషులతో పనిచేసే విధానం తగ్గిపోతుంది. ఇప్పటికే పదిమంది కావాల్సిన చోట ఆరుగురిని తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఇంకా ఆ సంఖ్య తగ్గిపోతుంది. రోబోలతో మనం పనిచేయించే కాలం నుంచి.. రోబోలే మనతో పనిచేయించో కాలం వచ్చేస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news