మనుషులు అన్నాక ఏదోక టాలెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే..కొందరు పనికిరాని పాత వస్తువులతో అద్బుతాలను చేస్తున్నారు..ఇలా కూడా వీటిని వాడుతారా అంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఇలాంటివి అరుదుగా కనిపిస్తాయి.. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది.నిజంగా అతని చేతితో ఏదో మ్యాజిక్ ఉందేమో.. అతని పెద్ద మెకానిక్ అయ్యింటారు.. ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. సదరు నెటిజన్లు.. ఇంతకీ ఆయన చేసిన అద్భుతం ఏంటో ఇప్పుడు చుద్దాము..
ఓ వ్యక్తి పాత కారు తో షాప్ ను పెట్టేశాడు.. అది చూపరులను తెగ ఆకర్షించింది.. అసలు అతను ఎలా క్రియేట్ చేశాడు అంటూ పలువురు అభినందించారు. ఆశ్చర్యానికి గురి చేసింది..పాత కారును దుకాణంగా మార్చిన ఓ వ్యక్తిని చూసి.. వావ్! ఏం ఐడియా గురూ.. అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వివరంగా తెలుసుకుందాం…
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి ”పాత మారుతి 800” కారును ఏకంగా దుకాణంగా మార్చేశాడు. వ్యాపారం చేయాలని అతడికి కోరిక ఉండేది. కానీ స్థల సమస్య, ఆక్రమణల భయంతో ఆలోచనలో పడ్డాడు. అయితే ఎలాగైనా తన ఆశయాన్ని ఆచరణలోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఇంకేముందీ వెంటనే తన మెదడుకు పని పెట్టాడు.
మారుతి పాత కారును చూడగానే తనకో ఐడియా వచ్చింది. కారు పైన టాప్‌ని తొలగించి, దానిపై చిన్నపాటి బంకును ఫిక్స్ చేశాడు. అందులో టీ, స్వీట్లు, పాన్ తదితరాలను విక్రయించడం మొదలెట్టాడు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కారును ఆపడం, వీలు ఉన్నంత సేపు వ్యాపారం చేయడం.. మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లడం చేస్తుంటాడు. తనకు ఎలాంటి స్థల సమస్య, ఆక్రమణల సమస్య లేదని చెబుతున్నాడు.. ఇతని కారు వ్యాపారం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.