త‌న దేశాన్ని ఉగ్ర‌వాదుల నుంచి కాపాడాలంటున్న స్టార్ క్రికెట‌ర్‌

ప్ర‌పంచ దేశాల్లో ఇప్పుడు ఉగ్ర‌వాదం ఏ స్థాయిలో పెరిగిపోతుందో అంద‌రికీ తెలిసిందే. కాగా దీని ఎఫెక్ట్ మ‌న దేశానికి ద‌గ్గ‌ర్లోనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పై మ‌రీ ఎక్కువ‌గా ఉంది. దీంతో ఇప్పుడు ఆ దేశంలో ఉగ్ర‌వాదులు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. యూఎస్, నాటో సైనిక శిబిరాలు తీసేయ‌డంతో ఇదే అదునుగా మార‌ణ హోమం చేస్తున్నారు తాళిబ‌న్లు.


దీంతో ఇప్ప‌డు ఆఫ్గ‌నిస్తాన్‌లోని 400 జిల్లాల్లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. వారి చేష్ట‌ల‌కు అడ్డుప‌డేవారే లేర‌ని చెప్పాలి. ఇక ఈ నెల 31 లోపు అమెరికా తన పూర్తి సైన్యాన్ని వెన‌క్కు ర‌ప్పించే దిశ‌గా ఆలోచిస్తోంది. అదే జ‌రిగితే తాలిబ‌న్ల చేతుల్లో ఆ దేశం విల‌విల‌లాడి పోవాల్సిందే న‌ని తెలుస్తోంది. ఇక ఈ సంద‌ర్భంలో ఆఫ్గ‌నిస్తాన్ స్టార్‌ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్ర‌పంచ దేశాల‌ను విజ్ఞ‌న్తి చేస్తున్నాడు.

త‌న దేశాన్ని ఎలాగైనా ఉగ్ర వాదుల చెర నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ప్ర‌స్తుతం త‌మ దేశంలో శాంతి భ‌ద్ర‌త‌లు లేవ‌ని తాలిభ‌న్లు ఇష్టారీతిన మార‌ణ హోమం సృష్టిస్తున్నారంటూ వాపోయాడు. కాబ‌ట్టి మ‌ళ్లీ త‌న దేశాన్ని శాంతి యుతంగా మార్చాల‌ని కోరుతున్నాడు. ఆక ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన పోస్టు కాస్త ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఆయ‌న చేసిన రిక్వెస్ట్‌కు ఎవ‌రైనా స్పందిస్తారో లేదో అన్ని మాత్రం చూడాలి.