పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? ఇక నో టెన్షన్‌

-

పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా ఆందోళణ న కలుగుతుంది. ఇక కరోనా కారణంగా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ పాఠశాలలను, కాలేజీలను తెరిచారు. పరీక్షల షెడ్యూల్లు కూడా ప్రకటిస్తున్నారు. ఈ కారణంగా పరీక్షలు విద్యార్థులను ఒత్తిడికి గురవుతున్నారు.

మార్చి– ఏప్రిల్‌ సీజన్‌ అంటే టెన్షన్‌ మొదలవుతుంది. ఈ పాటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామ్‌–2021 దగ్గర్లోనే ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే పదవ తరగతి పరీక్షలు కూడా రాబోతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.

కోచింగ్‌ క్లాసులు, పాఠాల రివిజన్‌ వంటివి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా వివిధ అంతరాలు ఏర్పడ్డం వల్ల విద్యార్థుల్లో కొంత ఒత్తిడి లేకపోలేదు. ఈ నేపథ్యంలో పాఠాలను ఎంతో త్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కొన్ని చిట్కాలను పాటించి చూడండి.

రాత్రి నిద్ర చాలా ముఖ్యం

ప్రశాంత వాతావరణంలో మనం పరీక్షలు రాయాలంటే రాత్రి నిద్ర చాలా అవసరం. ఎక్కువ చదవాలి, రివిజన్‌ చేసుకోవాలి అని నిద్ర పోకుండా మీరు రాత్రంతా చదివితే, చదివింది గుర్తుండకపోవడ మే కుంకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం త్వరగా లేచి చదివితే బాగా గుర్తుంటుంది.

ఆహారపు అలవాట్లు

జంక్‌ఫుడ్‌ తరచుగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి. ఇది మీ జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల పగలు చదువుకోవడానికి, రాత్రి పడుకోవడానికి సహాయపడుతుంది. డాక్టర్లు కూడా సమతూల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుందని, దీనివల్ల చురుకుగా శక్తినిస్తుందని తెలిపారు.

చదివే విధానం

చదువుకునే గదిలో సరిపోయే ఉష్ణోగ్రత ఉందా?లేదా? చూసుకోవాలి. వెలుతురు బాగా ఉండేలా, సిట్టింగ్‌ సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నుముకపై ప్రభావం పడుతుంది. ఈ నొప్పి మన చదువుని డిస్ట్రబ్‌ చేస్తుంది. ఒకే దగ్గర కూర్చొకుండా కాసేపు కూర్చొని చదివాలి. మరి కాసేపు అటూఇటూ తిరుగుతూ చదవడం మంచిది. దీనివల్ల శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎక్కువ అలసట ఉండదు, ఎక్కువ సేపు చదవడానికి వీలవుతుంది.

వ్యాయామం ఎంతో మేలు

పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కచ్చితంగా శారీరక వినోదానికి తగినంత స మయం కేటాయించాలి. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. సైక్లింగ్, వాకింగ్‌ చేయాలి. ఈ వ్యాయమం వల్ల మనం పరీ„ý టైమ్‌లో వచ్చే ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చు. మరో విషయం పరీక్షల సమయం వచ్చే వరకు అనవసరంగా సమయాన్ని నిరుపయోగం చేసి, పరీక్షలు వచ్చాక రాత్రి, పగలు చదివితే ఆరోగ్యం పాడవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news