ఆపరేషన్ చేసేప్పుడు డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయి వణికితే పేషంట్ ప్రాణానికే ప్రమాదం.. అయితే ప్రాక్టీస్ చేసే కొద్ది వైద్యులకు ఆపరేషన్ చేయడం చాలా సులభం అయిపోతుంది.. ఎంతో పెద్ద పెద్ద సర్జరీలు చేసి ప్రాణాలను కాపాడతారు.. కానీ కొన్నిసార్లు మీరు ఈ. వార్తలు వినే ఉంటారు.. ఆపరేషన్ చేసి పొట్టలో కత్తిని వదిలిపెట్టారు, వాచ్ మర్చిపోయారు అని సరిగ్గా అలాంటిదే ఇప్పుడు జరిగిన ఘటన కూడా.. పురుడు పోసి పొట్టలో టవల్ వదిలేశాడు ఓ వైద్యుడు.. అసలేం జరిగిందంటే..
లఖ్‌నవ్‌లో పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి ఆపరేషన్ చేశాడో వైద్యుడు. బిడ్డను బయటకు తీసి కడుపులో టవల్ వదిలేశాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అమ్రోహా ప్రాంతానికి చెందిన నజ్రానా అనే మహిళ కొద్ది రోజుల క్రితం పురిటినొప్పులతో.. స్థానిక సైఫీ నర్సింగ్ హోంలో చేరింది. అక్కడ వైద్యుడు మత్లూబ్, ఆయన సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా టవల్‌ను ఆమె పొట్టలోనే ఉంచి కుట్లేశారు. ఆపరేషన్ తర్వాత నజ్రానా కడుపునొప్పి ఎక్కువగా ఉందని చెప్పింది. కానీ, ఆ డాక్టర్.. బయట చలి ఎక్కువగా ఉండటం వల్ల అలా జరిగిందని చెప్పి మరో ఐదు రోజులు ఆసుపత్రిలోనే ఉంచాడు.. ఇంటికి వచ్చాక కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఆమె భర్త మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు మరో ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీశారు.
బాధిత కుటుంభీకులు పురుడు పోసిన వైద్యుడి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అనేది తెలియలేదు..కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం పోయి ఉంటే.. ఏం చేసేవాడని ప్రశ్నిస్తున్నారు. వైద్యులకు ఈ మధ్య కాలంలో నిర్లక్ష్యం బాగా ఎక్కువైంది..మనుషుల ప్రాణం అంటే లెక్కలేదని సోషల్ మీడియా వేదికగా ఇచ్చిపడేస్తున్నారు.