ఆ గుండె మామూలు గుండె కాదురా..హార్ట్‌ బీట్‌ 3 కిలీమీటర్ల వరకూ వినిపిస్తుందట..!

-

మనిషికికైనా, మృగానికి అయినా ఒకటే గుండె ఉంటుంది. అదే సినిమాను నడిపిస్తుంది. దాదాపు అందరి గుండెలు ఒకటే సైజులో ఉంటాయి.. కానీ.. ఇప్పుడు చెప్పుకోబోయే గుండె గురించి మీరు ఇంతకుముందు ఎప్పుడు విని ఉండరు. ఆ గుండెచప్పుడు మూడు కిలీమీటర్ల దూరం వరకూ వినిపిస్తుందట.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. బరువు 181 కిలోలు.. ఆ గుండె మామూలు గుండె కాదురా..?ఇంతకీ ఇది ఎవరికి ఉందో తెలుసా.?

సముద్రంలో బతికే జీవులు గురించి మనకు పెద్దగా ఐడియా ఉండదు.. ఏదో చేపలను పట్టుకోని తినడం తప్ప..అందులో ఎలాంటి జీవులు ఉన్నాయి.. వాటి జీవనవిధానం ఇవన్నీ మీకు తెలుసా..? ఇవి భలే ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే..ఈ సముద్రంలో ఉండే నీలి తిమింగలాలు. భూమిపై అతిపెద్ద జీవులలో ఇదీ ఒకటి.

నీలి తిమింగలం లోపలి భాగాల గురించి తెలిస్తే.. మాత్రం మీరు అవునా అంటారు. దాని గుండె(Heart) గురించి విషయాలు తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. నీలి తిమింగలాలు భూమిపై అతిపెద్ద జీవులలో ఒకటి. గోయెంకా నీలి తిమింగలం గుండె ఫోటో ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతుంది..దీని బరువు 181 కిలోలు. దీని వెడల్పు 1.2 మీటర్లు, ఎత్తు 1.5 మీటర్లు. దాని గుండె చప్పుడు 3.2 కి.మీ కంటే ఎక్కువగా వినిపిస్తుందట..

ఇది 2014లో న్యూఫౌండ్‌ల్యాండ్‌లో కొట్టుకుపోయిన నీలి తిమింగలం గుండెకు సంబంధించిన చిత్రం. ఇది పరిశోధన కోసం ఉంది. కెనడాలోని టొరంటోలోని రాయల్ అంటారియో మ్యూజియంలో శాస్త్రవేత్తలు భద్రపరిచారు. ఈ చిత్రాన్ని మార్చి 13న పోస్ట్ చేయగా దానిమీద చాలా మంది స్పందిస్తున్నారు. పోస్ట్ చూసిన వారు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇంత పెద్ద హృదయాన్ని సంపూర్ణంగా భద్రపరచడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news