కొవిడ్ వచ్చాక అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ప్రకటించాయి. అంతకు ముందు చాలామందికి ఇలా పనిచేసే వీలుంటుందని కూడా పెద్దగా తెలియదు.. వర్క్ ఫ్రమ్ మొదట్లో బానే ఉండేది కానీ పోను పోనూ పోర్న్ దిశగా అడుగులు వేస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ దేశంలో పోర్న్ అడిక్షన్ విపరీతంగా పెరిగిందంట..
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నప్పుడు పోర్న్ చూసే యూకే పౌరుల సంఖ్య రెట్టింపు అయ్యిందని డైలీ మెయిల్ నివేదించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నవారిలో పోర్న్ చూసే వారు ఎక్కువయ్యారని.. పోర్న్ వీక్షణ ఓ వ్యసనంలా మారిందని పేర్కొన్నారు. దానివల్ల వారు మరింత దిగజారారని తెలిపారు. అశ్లీలం, పోర్న్ వీక్షణ అనేది ఒక రకమైన సెక్స్ వ్యసనం. వినియోగదారులు ఆహ్లాదకరమైన అనుభూతికి లేదా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన “అధిక” వ్యసనానికి బానిసలవుతారని పేర్కొంది. గంటలకొద్దీ వారు పోర్న్ చూస్తూ కాలం గడిపేస్తున్నారని తేలింది.
14 గంటలు అదే పనిలో..
బ్రిటన్‌లోని అతిపెద్ద సెక్స్, పోర్న్ అడిక్షన్ క్లినిక్‌లో.. ఇప్పుడు రోజుకు 14 గంటల వరకు పోర్న్ చూసే కొంతమందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. “వర్క్ ఫ్రమ్లో పని చేసే వారు.. ఎక్కువగా, ఒంటరిగా తమ కంప్యూటర్ల ముందు సమయం గడుపుతున్నారు. అప్పుడు వారికి ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు రాత్రులు పోర్న్ చూసే వారు ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి ప్రైవసీ ఉండడం వల్ల రాత్రి వరకు వేచి చూడాల్సిన అవసరం లేకపోయింది. అందుకే వారు పగటిపూట కూడా పోర్న్ చూస్తున్నారు.” అని ఆమె మెయిల్ ఆన్‌లైన్‌తో తెలిపింది.
రెట్టింపు ..
2022 మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 750 మంది పోర్న్ బానిసలు ఉన్నట్లు గుర్తించారు. 2019 మొత్తానికి 950 మంది మాత్రమే ఉన్నారు. అంటే అక్కడ వాళ్లు ఎంతగా పోర్న్‌కి అడిక్ట్ అయ్యారో తెలుసుకోవచ్చు. పైగా ఈ సంవత్సరం క్లినిక్‌కి వచ్చే రోగులకు మరింత ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ అవసరం అని వైద్యులు పేర్కొంటున్నారు. లండన్ క్లినిక్‌లోని థెరపిస్ట్‌లు 2019లో నెలకు కేవలం 360 గంటలతో పోలిస్తే ఇప్పుడు పోర్న్ వ్యసనాలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి నెలకు 600 గంటల సమయం వెచ్చిస్తున్నారు.