హిమాలయాల్లో దొరికే ఈ పూల రసం ఎన్నో వ్యాధులకు దివ్యఔషధం..!!

-

హిమాలయాల్లో అనేది మూలికలు ఉంటాయంటారు..ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు, చెట్లు ఉంటాయి. కానీ హిమాలయ పర్వతాల్లో ఉండే ఎన్నో మూలికలను ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వాటితో తయారు చేసిన మందులు అనేక వ్యాధులతోను నయం చేస్తాయి.. అందులో బురాన్ష్ మొక్క కూడా ఒకటి. బురాన్ష్ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. లేత గులాబీ రంగులో ఆకర్షణియంగా కనిపిస్తాయి. ఈ పూలు వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా..!

ఈ పూలు ఎక్కువగా ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి.. బురాన్ష్‌లో ఔషధ గుణాలతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బురాన్ష్ పువ్వుల నుంచి రసం తీసి తాగుతారు. ఈ పువ్వుల రేకుల్లో క్వినిక్ యాసిడ్ (Quinic acid) ఉంటుంది. దీని రుచి అమోఘం. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

బురాన్ష్ పూలతో ప్రయోజనాలు:

బురాన్ష్‌లో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను దూరం చేయడం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
చర్మం, గొంతు, పొట్టపై మంటగా ఉంటే… అలాంటప్పడు బురాన్ష్ పువ్వుల జూస్‌ని తాగితే ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
బురాన్ష్ యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంతా పనిచేస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు బురాన్ష్ పువ్వుల రసాన్ని తాగమని నిపుణులు సూచిస్తారు.
బురాన్ష్ తీసుకోవడం ద్వారా శరీరంలో రక్త కొరతను తీర్చవచ్చు. బురాన్ష్ పువ్వులలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు దూరమవుతాయి.
బురాన్ష్‌ను ఆయుర్వేదంలో పోషకాల నిధిగా పరిగణిస్తారు. ఇందులో కాల్షియం, జింక్, ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయి. బురాన్ష్ పువ్వుల జూస్‌ని క్రమం తప్పకుండా తాగితే శరీరంలోని పోషకాహార లోపం తొలగిపోతుంది.
బురాన్ష్ పుష్పాలు ఎక్కువగా హిమాలయాల్లోనే ఉండడం వల్ల మనకు దొరకకపోవచ్చు. కానీ బురాన్షన్ పువ్వులతో చేసిన జ్యూస్‌లో సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.. ఈకామర్స్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. ఓసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news