సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తాయి..మామూలు వాళ్ళు చేస్తే ఫెమ్ కోసం అనుకోవచ్చు.బాధ్యత గల పోలీస్ వృత్తిలో వుండే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఫెమస్ అవుతున్నారు. మొన్నీమధ్య ఓ కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే… తాజాగా ఇంటర్నెట్‌లో మరో వీడియో చక్కర్లు కోడుతుంది.
ఓ అధికారి ప్రత్యేక రీతిలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నాడు. తనదైన స్టైల్లో డ్యూటీని ఆస్వాదిస్తూ వాహనదారులకు కూడా ఆనందం కలుగజేస్తున్నాడు.ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. హోంగార్డ్ జోగేంద్ర కుమార్, డెహ్రాడూన్‌లోని సిటీ హార్ట్ హాస్పిటల్ సమీపంలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఒక ప్రత్యేక రీతిలో వాహనాల కదలికలను నియంత్రిస్తున్నాడు. చేతులను వినూత్నంగా ఊపుతూ, సంజ్ఞలు చేస్తూ వాహనదారులతో పాటు చూపరులను అతడు ఆకట్టుకుంటున్నాడు..
ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో అతను ప్రత్యెకమైన పద్ధతిని తీసుకోచ్చినట్లు తెలుపుతున్నారు.తన ట్రాఫిక్ నియంత్రణ తీరు ప్రజలకు ఎంతో సంతోషం కలుగజేయడంతోపాటు వారిని ఉత్సాహపరుస్తున్నదని చెప్పారు. తన ట్రాఫిక్ నియంత్రణ స్టైల్‌ను ప్రజలు ఆస్వాదిస్తున్నారని ఆయన అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు వాహనదారులు విసుగు చెందకుండా ఉండేందుకు తాను తనదైన ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ విధానాన్ని ఆచరిస్తున్నట్లు హోంగార్డ్ జోగేంద్ర కుమార్ తెలిపారు..ఇలా తన డ్యూటీని ఆస్వాదిస్తూ వాహనదారులకు సూచనలు ఇవ్వడం సరదాగా ఉందని ఆయన చాలాసార్లు చెప్పాడు.అలా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది…ఈ వీడియో పోస్ట్ అయిన కొద్ది నిమిషాల కు లైకులు, షేర్ లతో ట్రెండ్ అవుతుంది.. వీడియోను చూసిన వారంతా కూడా కామెంట్ల తో హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూడండి..
#WATCH | Uttarakhand: Jogendra Kumar, a Home Guard deployed as a Traffic Police personnel near City Heart Hospital in Dehradun, controls the vehicular movement of traffic in a unique way. pic.twitter.com/zy2yyrhMio
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2022