భారతీయ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం భారతదేశంలోని ఆరు ప్రదేశాలు ప్రపంచ వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. అందులో తమిళనాడులోని కాంచీపురం దేవాలయాల నుండి వారణాసిలోని గంగా ఘాట్లు కూడా ఉన్నాయి. భారతీయ పురావస్తు శాఖ సబ్మిట్ చేసిన వాటి ప్రకారం ఆరు ప్రదేశాలు యునెస్కో రూపొందిస్తున్న ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో తాత్కాలికంగా చోటు సంపాదించుకున్నాయి. ఇంకా చివరి జాబితా ఇప్పుడే వెలువడలేదు.
భారతీయ పురావస్తు శాఖ వారు భారతదేశానికి చెందిన 9ప్రదేశాలని పంపారు. అందులో ఆరు మాత్రమే తాత్కాలిక జాబితాలో స్థానం సంపాదించాయి. కాంచీపురం దేవాలయాలతో కలుపుకుని ఆ ఆరు ప్రదేశాలు ఏంటంటే, మధ్యప్రదేశ్ లోని సత్పూర టైగర్ రిజర్వ్, కర్ణాటకలోని హైర్ బెంకల్ మెగాలిథిక్ సైట్, మహారాష్ట్రలోని మరాఠా మిలిటరీ నిర్మాణం, జబల్ పూర్ లోని నర్మదా నదీలోయ బేడాఘాట్- లేమ్ ఘాట్ ఇంకా కాంచీపురం దేవాలయాలు.
Delighted and proud that @ASIGoI had submitted a proposal for India’s 9 places for inclusion in tentative list of UNESCO, where six sites have selected in Tentative Lists of @UNESCO World Heritage Site. pic.twitter.com/CImxnYozR3
— Ministry of Culture (@MinOfCultureGoI) May 19, 2021
సత్పూర టైగర్ రిజర్స్
పులుల జనాభా ఎక్కువగా ఉన్న టైగర్ రిజర్వ్ గా పేరున్న ఈ జాతీయ పార్కులో 1500-10000ఏళ్ల క్రితం నాటి రాతి పెయింటింగ్స్ ఉన్నాయి.
గంగానదీ ఘాట్లు
గంగానదీ పక్కన ప్రాంతాలు, కళలు, సంస్కృతి మొదలగు వాటి విషయాల్లో పేరెన్నిక గన్నది.
హైర్ బెంకర్ మెగాలిథిక్ సైట్
ఇది 2800ఏళ్ళ క్రితం నాటి పురావస్తు ప్రాంతం.
మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్- మహారాష్ట్ర
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కాలం నాటి 20కోటలు ఇక్కడ ఉన్నాయి. వీటిని శివ్నేరి( శివాజీ పుట్టిన ప్రదేశం కాబట్టి) అని పిలుస్తారు.
కాంచీపురం దేవాలయాలు
దాదాపు వెయ్యి దేవాలయాలు ఒకే దగ్గర ఉన్న ఈ ప్రాంతం చాలా పురాతనమైనది. ఐతే ప్రస్తుతం 126దేవాలయాలు మాత్రమే ఉన్నాయి.
బేడాఘాట్- లామేటాఘాట్- జబల్ పూర్
జబల్ పూర్ ప్రాంతానికి 25కిలోమీటర్ల చుట్టుపక్కల పాలరాతి కొండలు చాలా ప్రసిద్ధి.